ఇప్పుడు కృషీవలుడు చదువుతూ ఉంటే ఎంతో కొత్తగానూ, తాజాగానూ, అప్పుడే కోసి గంపకెత్తిన కూరగాయల రాశిలానూ, దోసపండ్ల బుట్టలానూ కనిపిస్తున్నది.
డాక్ ఘర్
కాని ఆ పరిశోధకురాలు ఈ క్వారంటైన్ సమయంలో ఆ నాటిక గుర్తుకు తెచ్చి నా మనసుని చెప్పలేనంతగా మెత్తపరిచింది. టాగోర్ 1912 లో రాసిన ఆ నాటిక వందేళ్ళ తరువాత ఎంత కొత్త అర్థాన్ని సంతరించుకుంది!
జీవితాశయం
జీవితాశయమంటే ఏమిటి? జీవితసాఫల్యం రేపెప్పుడో సాధించవలసిన ప్రణాళిక మీద, మనం కన్న కలలో, కూర్చుకున్న తలపులో సఫలం కావడం మీద ఆధారపడిందా లేక ఇప్పుడే, ఇక్కడే మన జీవితాన్ని మనం నిండుగా స్వీకరించడం మీద ఆధారపడిందా?