ఆ పార్థివ శరీరం అగ్నికి ఆహుతైపోయింది. చుట్టూ చిగురిస్తున్నకానుగ చెట్లు, వేపచెట్లు.. కవితావసంతుడు వసంతఋతువులో కలిసిపోయాడు. నిబ్బరంగా నిల్చుందామనే అనుకున్నాను, కాని ఎక్కణ్ణుంచి వచ్చాయి అన్ని కన్నీళ్ళు.
ఇద్దరు ఆత్మీయులు
డా.యు.ఏ. నరసింహమూర్తి పూర్ణమానవుడు. తెలుగు రసజ్ఞ ప్రపంచంలో మన సమకాలికుల్లో సాలప్రాంశువు. ఏ సాహిత్యం ప్రశంసలోనైనా, సాహిత్యమీమాంసకైనా ఏ సంతోషం వచ్చినా, సందేహం వచ్చినా నాకొక పెద్దదిక్కుగా నిలబడ్డ మనిషి.
మల్లు వెళ్ళిపోయాడు
మల్లు ఇట్లా అర్థాంతరంగా వెళ్ళిపోయాడని తెలియకుండానే మా అమ్మానాన్నా వెళ్ళిపోవడం ఎంత మంచిదైంది. వాళ్ళకి గుండె పగిలిపోయుండేది, ఈ వార్త వింటే, మా అమ్మకి మరీ ముఖ్యంగా. మా అమ్మ మనసు, మా భద్రం మనసు, మల్లు మనసు ఒక్కలాంటివనిపిస్తుంది. వాళ్ళ ఒంట్లో రక్తం కాదు, గంగాజలం ప్రసరిస్తూంటుంది.