ఆ ప్రశ్నకి జవాబుగా డాస్టవిస్కీ ఒకటి కాదు, రెండు కాదు, అయిదు నవలలు రాసాడు. ఆ అయిదింటినీ కలిపి డాస్టొవిస్కీ రాసిన అయిదంకాల విషాదాంతనాటకంగానూ, Notes from Underground ను ఆ నాటకానికి ప్రస్తావనగానూ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఆ అయిదు అంకాల్లో బ్రదర్స్ కరమజోవ్ చివరి అంకం, అత్యంత నాటకీయమైన అంకం.
చిన్న కొండవాగు
పాఠశాల విద్యాశాఖనుండి గిరిజన సంక్షేమ శాఖకి రాగానే పెద్ద సముద్రం దగ్గరనుండి చిన్న కొండవాగు దగ్గరకు చేరినట్టుంది. కాని ఇది నా సొంత దేశం, నా సొంత ఊరు, సొంత ఇల్లు.
నేను కూడా భాగస్వామిని
కాని ఎన్నో సమస్యల మధ్య, ఒడిదుడుకుల మధ్య, మహమ్మారి ఎదట, పాఠశాల విద్యాశాఖ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కావడం నిజంగా జన్మసార్థక్యంగా భావిస్తున్నాను.