ఆనందం, ధైర్యం, విశ్వాసం కొరియర్లో ఇంటికి వచ్చేవి కావు. తెల్లవారిలేచి చూస్తే అడుగడుగునా, అనుక్షణం అవి మనమీద ధారాళంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే మనమింకా నిశ్చింతగా మన హృదయావేదనని అక్షరాల్లో పెట్టగలుగుతున్నాం.
వేదన వెలుగుగా మారిన వేళ-3
దేవాలయంలోంచి బయటికి వచ్చేటప్పటికి సంధ్యాకాశంలో నెలవంక కనిపిస్తున్నాడు. ఆయనకు దగ్గరగా శుక్రతార. నెలవంక కనబడే సాయంసంధ్యాగగనాన్ని చూస్తే శివసందర్శనమైనట్టే అని మా మాష్టారు గుర్తొచ్చింది. ఆ మహాశివాలయ ప్రాగణంలో అటు ఆకాశమూ,ఇటు నేలా కూడా పూర్తిగా శివమయమైపోయాయి.
వేదన వెలుగుగా మారిన వేళ-2
ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఆ అనుభూతి నన్ను వెన్నంటే ఉంది. దేవాలయాల్లో కప్పే శేషవస్త్రంలాగా, ఆయన మా అమ్మ కూడా అయి నన్ను దగ్గరగా తీసుకున్న ఒక అనిర్వచనీయమైన అనుభూతి.