సౌందర్యోపాసకుడు

ఆదివారం తెనాలిలో సంజీవదేవ్ శతజయంతి సభ. సాహిత్య అకాదెమీ నిర్వహించిన సభలో రోజంగా సంజీవదేవ్ కృషిమీద పెద్దలెందరో పత్రాలు సమర్పించారు. సాయంకాలం జరిగిన సమాపనోత్సవంలో సమాపనోపన్యాసం చేసే అరుదైన గౌరవం నాకు లభించింది.

రమణా సుమనశ్రీ అవార్డు

26 సాయంకాలం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రసిద్ధ కవి, ఆత్మీయమిత్రుడు సుమనశ్రీ కె.శివారెడ్డి ఇటీవలి కవితాసంపుటి 'గాథ ' కీ, నా కవితా సంపుటం 'నీటిరంగుల చిత్రం ' కీ రమణా సుమనశ్రీ అవార్డులు అందించాడు.  ఆ సత్కార సమావేశానికి మరొక ప్రసిద్ధ కవి, భావుకుడు దీవి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

ఒంటరి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి గురించి విన్నానుగాని, ఒకటి రెండు కథలు మినహా, ఆయన రచనలేమీ నేను చదవలేదు. ఇప్పుడు తానా నవలలపోటీలో బహుమతి పొందిన ఆయన నవల 'ఒంటరి' చదువుదామనుకుంటూ ఉండగానే మిత్రులు గజేంద్రనాథ్ గారు హన్స్ ఇండియాలో తాను రాసిన వ్యాసం ఒకటి నాకు పంపించారు.