భారతీయనవలాదర్శనం

ఈ మధ్య కొన్నాళ్ళుగా మిత్రులు తమకి ఇష్టమైన పుస్తకాల్ని వరసగా మిత్రులతో పంచుకుంటూ ఉన్నారు. మామూలుగా ఆస్తులు, డిగ్రీలు, హోదాలు, నగలు, చీరలు, ఫర్నిచరు ప్రదర్శించుకోడానికి ఇష్టపడే ఈ ప్రపంచంలో ఇట్లా తమకిష్టమైన పుస్తకాల్ని ప్రదర్శించుకుంటున్న మిత్రులు తామున్న మేరకి ఈ ప్రపంచాన్ని మరింత శోభాయమానంగానూ, ప్రేమాస్పదంగానూ చేస్తూ 'నువ్వు చదివే పుస్తకాలేవో చెప్పు , నీ మిత్రులెవరో చెప్తాను' అనే పాత మాటని 'నీ మిత్రులెవరో చెప్పు, నువ్వు చదివే పుస్తకాలేవో చెప్తాను' అంటో తిరగరాస్తున్నారు.

శివలెంక రాజేశ్వరీదేవి

శివలెంక రాజేశ్వరీదేవి కవితాసంపుటి ‘సత్యం వద్దు, స్వప్నమే కావాలి' (ప్రేమలేఖ ప్రచురణ, 2016) కి ఈ ఏడాది ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం ప్రకటించారు. ఆదివారం సాయంకాలం కాకినాడలో ఇస్మాయిల్ మిత్రమండలి ఏర్పాటు చేసిన ఆ పురస్కార సభకి అధ్యక్షత వహించేను. కాకినాడ రోటరీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఆ సభలో ఇస్మాయిల్ గారి కవిత్వంగురించి డా.కాళ్లకూరి శైలజగారు, ఆయన సాహిత్యవ్యాసాల గురించి చినుకు పత్రికా సంపాదకులు నండూరిరాజగోపాల్ గారు మాట్లాడేరు. పురస్కారం పొందిన పుస్తకం గురించి, ఆ కవిగురించి మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారు.

సాహిత్యప్రేమికుల మధ్య

శుక్రవారం సాయంకాలం భాస్కరరెడ్డిగారిని చూడటానికి నెల్లూరులో ఆగితే,ఆయన నా మాటలు వినడం కోసం కొందరు మిత్రులూ, పిల్లలూ ఎదురుచూస్తున్నారని దగ్గర్లో ఉన్న డిగ్రీ కాలేజి గ్రౌండ్సు లో చిన్న సమావేశం ఏర్పాటు చేసారు. పెరుగురామకృష్ణ పరిచయవాక్యాలు. అక్కడికి వచ్చినవాళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు.