గిరాం మూర్తి

అసలు గిరాం మూర్తి అనే పదప్రయోగం చేయడంలోనే శ్రీ శ్రీ గొప్ప ప్రజ్ఞ చూపించాడు. అది గిడుగు రామ్మూర్తి అనే పదానికి సంక్షిప్తరూపం మాత్రమేకాక, గిరాం అంటే మాటలు, వాక్కు, భాష కూడా కాబట్టి, రూపెత్తిన భాష అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే వాగ్దేవి స్వరూపమన్నమాట.

నీలిపడవ

లోకమంతా ఒక ఆకాశంగా మారినవేళ, నది ఒడ్డున మనుషులు కూడా వినిపించీ, వినిపించని గుసగుసగా మారిపోయినవేళ, ఒక పడవమీద కూచుని, తెరిచానీ పుస్తకం.

పాటలు పుట్టిన తావులు

జీవితసౌందర్యాన్ని మాటల్లోనూ, రంగుల్లోనూ పట్టుకోవడమెలానో కొంత సాధన చేసానుగాని, రాగాల్లో కనుగొనడమెట్లానో ఇంకా జాడతెలియడం లేదు. భగవత్కృప నా జీవితంలో సంగీత రూపంగా ఇంకా అనుభవంలోకి రావలసి ఉంది.