శివతాండవం

తాను శతాధికంగా రచనలు చేసినప్పటికీ తన పేరు శివతాండవంతో పెనవేసుకుని ఉండటం భగవంతుడు చేసిన చిత్రమని నారాయణాచార్యులుగారు రాసుకున్నారు. అది సంగీతం, నాట్యం, గానం, కావ్యం. శబ్దంతో చెక్కిన శిల్పం.

తొలి తెలుగు శాసనం

ఇవాళ ఏ కార్యాలయంలోనూ కూడా తెలుగులో ఒక ఉత్తరం కూడా రాయడానికి సిద్ధంగా లేని మనం దాదాపు పదిహేను శతాబ్దాల కిందట దానశాసనాన్ని నలుగురూ చదివేలా తెలుగులో చెక్కించిన ఆ రాజుల్నీ, ఆ పాలననీ ఏమని ప్రశంసించగలుగుతాం!

ఆంధ్రకవితాపితామహుడు

ఆ నవపారిశ్రామిక పట్టణమధ్యంలో పెద్దన విగ్రహం నాకు చాలా incongruous గా కనిపించింది. అది ధన్ బాద్ బొగ్గు గనుల మధ్య టాగోర్ ని చూసినట్టు ఉంది. ఉత్తర జర్మనీలో రూర్ ప్రాంతంలో గొథేని కలుసుకున్నట్టు ఉంది.