భాష, భక్తులు, భగవంతుడు

ప్రాచీన కాలంలో మార్గ, దేశి సంప్రదాయాల మధ్య సమన్వయం సాధించిన తెలుగు భాష ఇప్పుడు గ్లోబల్, లోకల్ ధోరణుల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తున్నదని వివరించాను.

దేవుడి సొంత దేశంలో

తుంచన్ పరంబు క్షేత్రంలో నడుస్తున్నంత సేపు నేను తెలుగు భాష గురించి, తెలుగుజాతి దైన్యం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఏమి? నాలుగున్నర ఎకరాలు తెలుగు నేలమీద ఒక కవి కోసం ఎక్కడా దొరకదా?

పాలమూరు అడవిదారిన-2

కాని మాఘమాసపు అడవి ఉందే, అది పూర్తిగా అంతర్ముఖీన భావుకత. తనలోకి తాను ఒదిగిపోయి ఉండే ఒక జెన్ సాధువు అంతరంగంలాంటిది. ఒక యోసా బూసన్ హైకూ లాంటిది, సంజీవ దేవ్ పేస్టల్స్ చిత్రలేఖనం లాంటిది. ఏక్ తార మీటుకుంటూ పాడుకునే బైరాగి తత్త్వం లాంటిది.