ఒక మనిషిని కలుసుకున్న వేళ

అజ్ఞానం వల్ల మనుషుల్లో కనిపించే అమాయికత్వం కాదు, లోకాన్ని దాని నిష్టుర పార్శ్వాలన్నింటిలోనూ చూసి, తలపడి, మానసికంగా ఓడించి, క్షమించిన తరువాత, ఆ విజేత కళ్ళల్లో కనిపించే ఇన్నొసెన్స్.

సీతారామశాస్త్రి

సిరివెన్నెల కవిత్వం వినడానికే ఎక్కువ మోహపడ్డాను. అది కూడా, కేవలం ఆయన పాడితే వినడం కాదు. తాను పాడుతున్న పాటల మధ్య,ఎదుటివాళ్ళు వినిపిస్తున్న కవితల మధ్య, మధ్యమధ్యలో కవిత్వం గురించి ఆయన వివశత్వంతో మాట్లాడే మాటలు.

డా. రాధేయ

తన సొమ్ము, తన కష్టార్జితం, తన పిల్లలకోసం దాచివుంచుకోవలసిన డబ్బుతో, ప్రకటనలిచ్చి, కవిత్వసంపుటాల్ని ఆహ్వానించి, న్యాయనిర్ణేతలని వెతికి పట్టుకుని, పుస్తకాలు ఎంపికచేసి, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడే సభలు నిర్వహించి, ఆ ఆ కవుల్ని యథాశక్తి సత్కరించి-ఇట్లానే మూడు దశాబ్దాలు గడిపేడు.