విద్యా కానుక

రెండు లక్షల మంది గిరిజన విద్యార్థులకే ఎప్పుడూ ఏ సామగ్రీ సకాలంలో పంపిణీ కాని రోజులనుండి, నేను నా ప్రభుత్వోద్యోగంలో, 42 లక్షల మంది విద్యార్థులకి వారి విద్యాసామగ్రి మొత్తం ఒక స్కూలు కిట్ గా అందించగలిగే రోజులదాకా ప్రయాణించాను.

మన బడి నాడు నేడు

ఏమిటని అడిగితే మూడువందల మంది పిల్లలు అడ్మిషన్లకోసం అప్లికేషన్లు పెట్టుకున్నారని చెప్పింది. రోజూ తల్లులు తమ పిల్లల్ని తీసుకుని ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టి ఆ గోడలమీద గీసిన రంగు రంగు బొమ్మల దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని చెప్పిందామె.

చర్చ ఒక సాధన

విల్బర్డింగ్ రాసిన పాఠ్యప్రణాళికని నేను చాలా క్లుప్తంగా పరిచయం చేసాను. అతడు తన పుస్తకం ముగిస్తూ ఒక చైనా సామెత ను ఉదాహరించాడు. దాని ప్రకారం 'ఉపాధ్యాయుడు చేసేది తలుపు తెరవడమే. లోపలకి ప్రవేశించవలసింది మాత్రం నువ్వే.'