మెడిటేషన్స్-12

చాలా సార్లు ఇతరులమీద మనం ఆరోపణలు చేసేముందు, మన అసంతృప్తి వెళ్ళగక్కేముందు మనం కూడా వాళ్ళకేమీ భిన్నం కాదని మర్చిపోతూ ఉంటాం. వాళ్ళ పనులు మనల్ని ఎంత బాధిస్తున్నాయో మన మాటలు కూడా వాళ్ళని అంతే బాధిస్తూ ఉండవచ్చు. ఈ vulnerability లో మనుషులంతా దాదాపుగా సమానులే. 

మెడిటేషన్స్-11

చాలా విలువైన మాటలు. మనుషులు 2500 ఏళ్ళుగా తిరిగి తిరిగి చేస్తున్న పొరపాటు ఒక్కటే. మనం అయితే ఆదర్శరాజ్యం గురించో లేదా మరోప్రపంచం గురించో కలలుగంటో, ఇప్పుడు ఈ క్షణాన జీవించవలసిన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. చిన్నపనితో మొదలుపెట్టడం మనకి నచ్చదు. చిన్నపని నిజానికి చిన్నదేమీ కాదు.

మెడిటేషన్స్-10

సుఖాన్ని స్వీకరించగలం మనం ఉత్సాహంగా, కాని దుఃఖం ప్రాప్తించినప్పుడే, మనం స్తిమితం తప్పుతాం. అప్పుడే తోటిమనిషినీ, దేవుణ్ణీ నిందించడం మొదలుపెడతాం. కాని సుఖదుఃఖాలు రెండింటినీ స్వాగతనేత్రాల్తో స్వీకరించి కూడా తన స్తిమితం కోల్పోకుండా ఉండటం, అదీ తన ఆనందం అని చెప్తున్నాడు అరీలియస్