తనలోంచి తనని విడదీసి చూసుకోగలడం. అంటే తన దేహం నుంచీ, తన శ్వాసనుంచీ తనను వేరు చేసి చూసుకోగలగడం, ఇదే యోగం, ఇదే యాగం. నిజానికి, మెడిటేషన్స్ పన్నెండవ అధ్యాయాన్ని గ్రీకు భాషలో ఒక రోమను రాసుకున్న కఠోపనిషత్తు అనడానికి నాకు ఎటువంటి సంకోచమూ కనిపించడమూ లేదు.
మెడిటేషన్స్-13
మంచివాడు కావడమనే వృత్తికీ మామూలు వృత్తులకీ తేడా ఏమిటంటే, ఇక్కడ పనిగంటలు ఉండవు, జీతభత్యాలు ఉండవు, నీపైన అధికారివి నువ్వే, నీ కింద పనిచేసే సిబ్బందీ నువ్వే.
మెడిటేషన్స్-12
చాలా సార్లు ఇతరులమీద మనం ఆరోపణలు చేసేముందు, మన అసంతృప్తి వెళ్ళగక్కేముందు మనం కూడా వాళ్ళకేమీ భిన్నం కాదని మర్చిపోతూ ఉంటాం. వాళ్ళ పనులు మనల్ని ఎంత బాధిస్తున్నాయో మన మాటలు కూడా వాళ్ళని అంతే బాధిస్తూ ఉండవచ్చు. ఈ vulnerability లో మనుషులంతా దాదాపుగా సమానులే.