గ్రేటా థున్ బెర్గ్ ఎఫెక్టు

గ్రేటా థున్ బెర్గ్ ప్రసంగాలు వింటుంటే మహాత్మాగాంధీని వింటున్నట్టు అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మాటల్లో అదే సూటిదనం, అదే సత్యసంధత. అదే నిర్భరత్వం, అదే నిర్భయత్వం.

ఆ స్ఫూర్తి నానాటికీ బలపడుతున్నది

అందుకనే, మునుపెన్నటికన్నా కూడా నేడు గాంధీజీ స్ఫూర్తి మనకొక సామాజిక-నైతిక అవసరంగా మారుతున్నదని గ్రహిస్తున్నాను. అహింసని మనమింకెంత మాత్రం వ్యక్తి ధర్మంగా భావించి పక్కనపెట్టలేం. అన్నిటికన్నా ముందు అది జాతిధర్మం, దేశధర్మం, ప్రపంచధర్మంగా మారవలసి ఉంది. గాంధీజీ అన్నిటికన్నా ముందు అహింసావాది, ఆ తర్వాతే జాతీయోద్యమవాది, సంస్కర్త, మరేమైనా.

సాంస్కృతిక వినమ్రత

అలా కొత్త పార్శ్వాలు తెరుచుకుంటున్నందువల్ల నీ ప్రపంచం మరింత విస్తృతమవుతోందనీ, నీ అనుభవం మరింత సుసంపన్నమవుతోందనే ఎరుక, అనిదంపూర్వమైన సంతోషాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.