రోజూ ఒక పండగే

నిన్న వేట్లపాలెం శ్రీ రామకృష్ణ ధ్యానమందిరంలో ఆ ఉపాధ్యాయులతోనూ, ఆ పిల్లలతోనూ మాట్లాడుతున్నంతసేపూ చెప్పలేని ఎన్నో భావాలు నా మనసులో కదుల్తూ ఉన్నాయి.

కాని తెలుగు?

సాహిత్య భాషగా తెలుగు ప్రపంచంలోని అత్యుత్తమమైన పదిభాషల్లో ఒకటి. ఆ విషయంలో దిగులు లేదు. నేను మాట్లాడుతున్నది శాస్త్ర, సాంకేతిక భాషగా, సామాజిక శాస్త్రాల భాషగా తెలుగు వికసించవలసిన అవసరం గురించి.

గ్రేటా థున్ బెర్గ్ ఎఫెక్టు

గ్రేటా థున్ బెర్గ్ ప్రసంగాలు వింటుంటే మహాత్మాగాంధీని వింటున్నట్టు అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మాటల్లో అదే సూటిదనం, అదే సత్యసంధత. అదే నిర్భరత్వం, అదే నిర్భయత్వం.