ప్రస్తుతం నడుస్తున్న విద్యావిధానానికి కాలం చెల్లిందనీ, కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మన విద్య రూపొందాలనీ, ఆ ప్రక్రియలో సమాజంలో ఇంతదాకా వెనకబడ్డ వర్గాలకూ, సమూహాలకూ కూడా ప్రాధాన్యం లభించాలనీ నలుగురికీ తెలిసినా చాలు, నా పుస్తకం సఫలమయినట్టే.
మరికొన్ని కలలు, మెలకువలు-2
రానున్న రోజుల్లో విద్యారంగంలో అటువంటి ఉద్యమకారులు రానున్నారన్న ఆశతో వారికి నా అనుభవాల్నీ, నా అధ్యయనం ఆధారంగా నేను నేర్చుకున్న పాఠాల్నీ, ఆ పాఠాల వెలుగులో నేను సూచించగల కొన్ని వ్యూహాల్నీ అందించడానికే ఈ అనుభవ కథనం మొదలుపెడుతున్నాను.
మరికొన్ని కలలు, మెలకువలు-1
ఆ విద్యావిధానాల నేపథ్యంలో ఒక గిరిజనసంక్షేమాధికారిగా, ఒక విద్యాశాఖాధికారిగా నా అనుభవాల్ని, ఆ ప్రస్థానంలో నేనెదుర్కున్న ప్రశ్నల్ని, వాటికి నేను వెతుక్కున్న సమాధానాల్ని గ్రంథస్థం చేయడంవల్ల ఆయా రంగాల్లో కృషి చేస్తున్నవారికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ అనుభవకథనం మొదలుపెడుతున్నాను.