సంగీత విద్య

ఆ పాఠశాల ఎన్ని అరకొర సౌకర్యాలతోనైనా ఉండనివ్వు, అక్కడ ఎన్ని సమస్యలైనా నడుస్తుండనివ్వు, అక్కడ కనీసం ఒక్క ఉపాధ్యాయుడేనా, పొద్దుటిపూటనో, సాయంకాలమో పిల్లలతో ఒక గీతం ఆలపిస్తే, అది నా దృష్టిలో సర్వోన్నత పాఠశాల.

పిల్లలపండగ

అందుకని ఈసారి పిల్లల పండుగలో ఈ కథారచన పోటీకి. పిల్లలకి కథ గురించి చెప్పటం నాకు చాలా సంతోషం కలిగించింది. రెండేళ్ల కిందట పాఠశాల విద్యాశాఖ అధిపతిగా నేను పిల్లల పండగలో పాల్గొన్నప్పటి కన్నా సరిగ్గా ఈ కారణం చాతనే, ఈసారి నా భాగస్వామ్యం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.

మరికొన్ని కలలు, మెలకువలు-3

ప్రస్తుతం నడుస్తున్న విద్యావిధానానికి కాలం చెల్లిందనీ, కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మన విద్య రూపొందాలనీ, ఆ ప్రక్రియలో సమాజంలో ఇంతదాకా వెనకబడ్డ వర్గాలకూ, సమూహాలకూ కూడా ప్రాధాన్యం లభించాలనీ నలుగురికీ తెలిసినా చాలు, నా పుస్తకం సఫలమయినట్టే.