ఇండీ రూట్స్

సోమాజిగూడ మినర్వా కాఫీ షాపులో ఓ మధ్యాహ్నం టిఫిన్ చేద్దామని అడుగుపెట్టగానే నా మిత్రురాలొకామె చాలారోజుల తర్వాత కనిపించింది. మేమిద్దరం కుశలప్రశ్నలమీంచి మా పాతజ్ఞాపకాలు నెమరేసుకున్నాం. మాటలమధ్యలో, మేమొకప్పుడు, చార్మీనార్ దగ్గర చీరలమీద అద్దకం చేసే బ్లాక్ ప్రింటింగ్ కళాకారుల్ని వెతుక్కున్న ఒక సాయంకాలాన్ని కూడా తలుచుకున్నాం. ఆ అద్దకం గుర్తురాగానే ఆమె 'మీకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను రండి ' అంటో, ఆ షాపింగ్ కాంప్లెక్సు మొదటి అంతస్థులోకి తీసుకువెళ్ళింది. మెట్లెక్కగానే మొదటిషాపే.

గురూజీ మాటలు మరికొన్ని

నేనా రోజు ఆ అర్థశాస్త్రవేత్తలకి ఆ కథంతా చెప్పి ' ఈ దేశంలో బీదరికం ఎవరి పాపం అని అడుగుతున్నారు కదూ. ఈ ఘోరాన్ని చూస్తూ తలకొక మాటా మాట్లాడుతున్న మీదే ఈ పాపమంతానూ' అన్నాను.

మరికొన్ని మంచిమాటలు

గురూజీ గురించి తలుచుకోవలసింది, ఆయన చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవలసిందీ చాలా ఉంది. కొన్ని కొన్ని మాటలమీద కొన్నేళ్ళ పాటు చర్చించుకోవలసి ఉంటుంది.  దలైలామా సహచరుడైన రింగ్ పోచే కళాశ్రమాన్ని చూసి 'మీరు గాంధీజీ హింద్ స్వరాజ్ పుస్తకంలో ఏమి రాసారో అచ్చం అలానే జీవిస్తున్నారు ' అని అన్నాడట.