నాడు నేడు

ఈ రెండేళ్ళుగా పాఠశాల విద్యాశాఖలో ఒక అధికారిగా, ఈ పరివర్తనలో నేను కూడా ఒక భాగస్వామిని కావడం, అది కూడా నా ఉద్యోగ జీవితపు చివరిదినాల్లో, ఇంత చారిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. బహుశా ఈ అనుభవాలన్నింటినీ మరింత సమగ్రంగా రాస్తే, అది 'కొన్ని కలలు, కొన్ని మెలకువలు' రెండవ భాగం అవుతుందనుకుంటాను.

సంకల్పం చెప్పుకుందాం

అక్కడ 'ఇండియన్ ' అనే పదం మూఢ జాతీయతని కాదు, ఉజ్జ్వలమైన బృంద స్ఫూర్తిని స్ఫురింపచేస్తున్నది. అక్కడ ఇండియా ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒకే ఒక్క మతం అంతకన్నా కాదు. అక్కడ ఇండియా ఒక టీం, ఒక ఉమ్మడి భావన, వ్యక్తి తనని తాను వెనక్కి నెట్టుకుని తనొక బృందంగా మారే క్రమశిక్షణ, సంస్కారం, సంస్కృతి.

చెప్పుకోదగ్గ అధ్యాయం

ఆ సమయంలో, ఒక కొత్త బాధ్యత నాకు లభించిందన్న దానికన్నా, పసితనంలో ఒక కబ్ గా, స్కౌటుగా శిక్షణ పొందిన ఒక విద్యార్థికి రాష్ట్రస్థాయి బాధ్యతలు లభించాయన్నదే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది.