నాలుగు ఋతువులు, నాలుగు దృశ్యాలు

ఎవరేనా కవి లేదా రచయిత తన పుస్తకం మీద మాట్లాడమనో లేదా సమీక్ష చెయ్యమనో అడిగిన తొలిరోజుల్లో ఎలాంటి ఆత్మ విశ్వాసం కలిగేదో, ఆయన నన్ను బొమ్మలు వేసిమ్మని అడిగినప్పుడు కూడా అటువంటి ఎక్సైట్ మెంట్ నే కలిగింది.

మధురనిరాశ

కబీరు అన్నాడే: ప్రేమ గురించి చెప్తూ- ఊరంతా తగలబడ్డా కూడా మళ్ళా పక్కింటి నిప్పుకోసం పోయినట్టు ఉంటుంది అని. చిత్రకళ కూడా అంతే.