పార్థివత్వం, అపార్థివత్వం

అంతిమంగా ఏ కళాకారుడైనా రాయవలసిందీ, చిత్రించవలసిందీ, మతానికీ, ప్రాంతానికీ, భాషలకీ, సరిహద్దులకీ అతీతంగా మనిషికీ, మనిషికీ మధ్య వికసించవలసిన స్నేహమే అని తెలియడం అది. ఒక నరుడికీ, ఒక వానరుడికీ మధ్య తటస్థించిన స్నేహాన్ని ఆదికవి ఎందుకంత ఐతిహాసికంగా గానం చేసాడో మనకి బోధపడక తప్పని సమయమది.

ఒక క్లాసిక్

సాధారణంగా మనం రచయితలు తమ సర్వోత్కృష్ట కృతులేమిటో తమకి తెలిసే రాస్తారనుకుంటాం. కాని క్లాసిక్స్ నిజానికి రచయితలు రాసేవి కావు. వారు రాసిన రచనల్లోంచి ఒకటీ అరా ఎన్నుకుని పాఠకులు వాటిని క్లాసిక్స్ గా రూపొందిస్తారు. ఈ మాట సర్వోన్నత కృతులుగా మనం పేర్కొనే ప్రతి ఒక్క రచనకీ, శాకుంతలం నుండి హామ్లెట్ దాకా ప్రతి ఒక్క రచనకీ వర్తించేదే.

సున్నితమైన సంఘర్షణ

సినిమా చూసినప్పణ్ణుంచీ మళ్ళా హృదయంలో ఒక జోరీగ చప్పుడు మొదలయ్యింది. 'చినవీరభద్రుడూ, చూడు, అట్లాంటి ఒక కథ రాయాలి నువ్వు, మామూలు మనుషులు, మామూలు రోజువారీ జీవితం, మామూలు రొటీన్. కానీ నువ్వు కథ చెప్పడం పూర్తయ్యేటప్పటికి చదివినవాళ్ళ కళ్ళు సజలాలు కావాలి, రాయగలవా? 'అంటో.