మార్క్ ఫోలీ

ఇప్పుడు నీటిరంగుల్తో ప్రయోగాలు చేస్తున్న వాళ్ళల్లో అగ్రగణ్యుడైన ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లిని నేను అభిమానిస్తున్నానని చెప్పానుకదా, మరి మొరెల్లి అభిమానిస్తున్న చిత్రకారులెవరు? అతడు అమెరికన్ గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లాసర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు. కాని ఇటీవలి కాలంలో అతడు పదే పదే మాట్లాడుతున్న చిత్రకారుడు తన కన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడైన మార్క్ ఫోలీ.

చిత్రలేఖన పద్ధతుల గురించి

తెలుగులో చిత్రకళా ప్రశంస (అప్రిషియేషన్ అనే పదానికి సరైన తెలుగు పదం నాకింతదాకా దొరకలేదు) చాలా తక్కువ. ఆ మాటకొస్తే ఒక కవితనీ, కథనీ ఎట్లా చదవాలో కూడా నేర్పే కోర్సులేవీ మనకి లేవు. సంగీతం విషయం చెప్పనక్కర్లేదు. ఏదైనా ఒక సంగీత కచేరీమీద పత్రికల్లో వచ్చే సమీక్షలు చదివితే సంగీత ప్రశంసకు తగిన పదబంధాలు మనకింకా దొరకనేలేదని తెలుస్తుంది.

సయ్యద్ హైదర్ రజా

ఇరవయ్యవ శతాబ్దిలో భారతీయ కళాకారులు కేవలం కళకి సంబంధించిన ప్రశ్నలేకాక, దర్శనానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నారు. అసలు వారి దార్శనిక సమస్యలే వారి కళాభివ్యక్తిని నిర్దేశించాయని కూడా చెప్పవచ్చు. కవులైనా, చిత్రకారులైనా, సంగీతకారులైనా, సాధకులందరీ సమస్యా ఇదే. 

Exit mobile version
%%footer%%