తుమ్ రాధే బనో శ్యామ్

'ఓ ప్రేమికా, నువ్వు నీ ప్రేయసిగా మారు' అనే మాటలో సముద్రమంత స్ఫురణ ఉంది. కబీరు ప్రేమగీతాల్లోని విరహం, టాగోర్ ప్రేమ గీతాల్లోని వేదన మొత్తం ఒక్క వాక్యంలోకి కుదిస్తే అది 'తుమ్ రాధే బనో శ్యామ్ ..'అనడమే అవుతుంది.

విధ్వంసం మీంచి నిర్మాణం

కొన్ని మహాయుగాలకు పూర్వం క్రోమాన్యాన్ గుహల్లో, అల్టామీరా గుహల్లో బొగ్గుతో చిత్రలేఖనాలు గియ్యడం మొదలుపెట్టినప్పుడు మానవుడు వేటకన్నా, ఆహారసముపార్జన కన్నా ప్రత్యేకమైన మానవానుభవాన్ని అందులో చూసాడు. ఒక మానవానుభవానికి మెషిన్ అనుభవం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాజాలదు

ఆ సినిమానే సాక్ష్యం

ప్రస్తుతం సినిమా ఒక్కటే మన ఏకైక కళారూపం అనుకుంటే, ఈ బండతనం, ఈ వెకిలితనం, ఈ నిర్లజ్జతనం మన జీవితంలోంచి సినిమాలోకి ప్రవేశిస్తున్నాయా లేక సినిమాలోంచి మన జీవితాల్లోకి అడుగుపెడుతున్నాయా అర్థం కావడం లేదు.