సుకృతుడు

గంగా, యమునా జలాల మీంచి వీచేగాలుల్తో పాటు, సాయంకాలపు నమాజ్ వినిపించే సంధ్యాకాంతితో పాటు, దేవాలయాల్లో పొద్దుటిపూట అల్లుకునే ఒక మంగళమయసునాదంతో అతడి సంగీతం నిండిపోయి ఉందని తెలియడానికి మనకి హిందుస్తానీ సంగీత పరిజ్ఞానంతో ఏమీ పనిలేదు.

అక్కా! నేనో కలగన్నాను!

గొప్ప వాన కురిసినప్పటిలా ద్యావాపృథ్వులు ఏకమయ్యే ఆ గొప్ప వెలుగు ఈ గీతం పాడుతున్నంతసేపూ గాయకుడి స్వరంలోనూ, వదనంలోనూ కూడా వెల్లివిరుస్తూనే ఉంది.

నవ్యానందం

అనువాదం లానే గానం కూడా ఒక కావ్యానికి కొత్త తలుపు తెరుస్తుంది. అంతవరకూ మనం ఎన్ని సార్లు చదివి వున్నా కూడా మన దృష్టి నిలవని ఏ పంక్తిమీదనో, పదబంధం మీదనో అకస్మాత్తుగా వెలుగు పడుతుంది. మళ్ళా ఆ కావ్యం మనకి మరింత సన్నిహితమవుతుంది.

Exit mobile version
%%footer%%