యాంటిగని

ఇది ఈ కాలంలో ప్రతి పాలకుడూ, ప్రతి పాలితుడూ తప్పనిసరిగా చూడవలసిన కథ, వినవలసిన కథ, మాట్లాడుకోవలసిన కథ అనిపించింది. ఎందుకంటే పాలకుడు దేశ క్షేమం పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు సమంజసం కాదని అనిపిస్తున్నప్పుడు ప్రతి పౌరుడూ తన మనసులో మాటని పెదవులు దాటించక తప్పదు. లేకపోతే అది దేశానికే అరిష్టం.

నాట్యధర్మి, లోకధర్మి

వాయిస్ ఓవర్ కి అనుగుణంగా విశాలమైన తెరమీద ఒక పక్కనుంచి అంగవస్త్రంతో, ముక్కుమీదకి జారుతున్న కళ్ళద్దాలూ, చేతికర్రతో ఒక నీడ కనిపించగానే కళాకేంద్రమంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది. ఆ ఛాయారూపం తెరకి ఈ కొసనుంచి ఆ కొసకి వెళ్ళేదాకా ఆ చప్పట్లు అట్లా మార్మ్రోగుతూనే ఉన్నాయి.

ఏమి రాగాలు! ఏమి భావాలు!

చూస్తున్నంతసేపూ మనమీంచి ఆ జలపాతాలు ప్రవహించిపోతూనే ఉన్నాయి. ఆ సౌష్టవ భంగిమలు, ఆ అభినయ శుద్ధి, ఆ వాచికం, ఆ తాళధ్వని, జీవితాన్ని పరిశుభ్రపరిచి సుసంస్కృతం చేసి నీ ముందు స్వీకారయోగ్యంగా నిలబెట్టిన క్షణాలవి.

Exit mobile version
%%footer%%