రూపకం నడుస్తున్నంతసేపూ మనం మనలోకి చూపుసారిస్తాం. మనల్ని మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం, ఏవో జవాబులు చెప్పుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఏ ఒక్క జవాబూ తృప్తి కలిగించదు. మనలో ఈ కలవరం కలిగించడమే నాటక బృందం ఉద్దేశ్యమయితే వారు అనుకున్నది సాధించారనే చెప్పాలి.
పాకుడు రాళ్ళు
పాతికేళ్ళుగా ఎదురుచూస్తున్నాను ఇట్లాంటి రోజు కోసం. ఒక నాటకం కోసం ప్రేక్షకులు ఇలా విరగబడే రోజు కోసం.
వెలుగునీడలు కలగలిసిన దేవత
సంస్కృత నాటకంలో ఆ పాపభారాన్ని విదూషకుడు తన భుజాల మీద వేసుకుంటాడు. యజ్ఞాల్లో విదూషితమైన హవిస్సుల్ని వరుణుడు స్వీకరించినట్టుగా.