తొలి తెలుగు శాసనం

పదిహేడు శతాబ్దాల కింద రాతి మీద చెక్కిన తెలుగు అక్షరాలు తెలుగు సీమలో, తెలుగు నేలమీదనే నిలిచి ఉన్నాయన్న సంగతి విని హృదయం ఉప్పొంగే వాళ్ళు కొందరేనా ఉన్నారు. వారందరూ ఒంటేరు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞులుగా ఉంటారు.

గిరిజన మూజియం

ఒక డాక్యుమెంటరీ మొదలుకాగానే అడవిలో కోదుకన్యలు నాట్యం చేస్తూ గీతాలాపన మొదలుపెట్టగానే నా హృదయం లయ తప్పిపోయింది. ఎప్పుడో ఎక్కడో దారితప్పి, మందకి దూరమైన లేగ దూడకి, ఆవుల అంబారవాలు వినిపిస్తే ఎలా ఉంటుందో ఆ గిరిజన గీతాలాపన వినగానే నాకలా అనిపించింది.

గాంధీ మూజియం

అక్షరధాం ఆలయంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ వాస్తువైభవం చూసినదానికన్నా, మహాత్ముడి జ్ఞాపకాలుగా అక్కడ భద్రపరిచిన తకిలీలు, ఆయన వాడిన లోటాలు, పళ్ళేలూ, చెప్పులూ, కళ్ళద్దాలూ, చివరికి పళ్ళుకుట్టుకునే పుల్లలూ చూసినప్పుడు నాకు మానసికంగా ఎంతో తృప్తిగా అనిపించింది.