దంగల్

ఒక జాతిగా మనం మరీ తెలివిమీరిపోయామా? లేక మనం మనకే తెలీనంత సినికల్ గా మారిపోయామా? ఇట్లాంటి కథలు మన చుట్టూ, మన మధ్య సంభవించడం లేదా? ఇట్లాంటి పోరాటాల్ని మనం పోరాటాలుగా గుర్తించలేకపోతున్నామా?

రంగ్ రసియా

ఒక కవి దృక్పథమో, ఒక కళాకారుడి చిత్రణో నచ్చనివాళ్ళు తిరిగి తమ కవిత్వం ద్వారా, కళ ద్వారానూమాత్రమే వారిని ఎదుర్కోవలసిఉంటుంది. అలా ఎదురుకుంటున్నప్పుడు ఆ వ్యతిరేకవర్గాల వాళ్ళు తాము ఎవరిని వ్యతిరేకిస్తున్నారో వారితో సమానమైన శిల్పప్రమాణాలూ, శ్రేష్టతా చూపించవలసిఉంటుంది. ఆ సంఘర్షణ కళాత్మకంగా జరగవలసిఉంటుంది.

శోకం శ్లోకంగా మారిన మరోకథ

Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి, చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిసి ఒక బూడిదరంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయేయి.