వాళ్ళు విడదీస్తారు, మనం కలుపుకోవాలి

వివిధ రకాల సామాజిక నేపథ్యాలమధ్య, వివిధ రకాల ప్రాంతీయ అసమానతలతో ఒక జాతిగా ఎదగలేని దేశాల్లో, ఆ సంఘర్షణకు అందరికన్నా పెద్ద మూల్యం చెల్లించేది పిల్లలు. ఎందుకంటే ఆ జాతులకి తమ రాజకీయ విభేదాల్ని పరిష్కరించుకోవడం పట్ల ఉన్న ఆసక్తి తమ పిల్లలపైన తమ శ్రద్ధ నీ, కాలాన్నీ పెట్టుబడి పెట్టడం మీద ఉండదు.

తరగతి గదిలో జడలబర్రె

ఒక్క కథ, ఒక్క సంఘటన, ఒక్క అనుభవం- ఒక్కటి చాలు, మనుషుల పట్ల, మనుష్య ప్రయత్నాల పట్ల మన నమ్మకాన్ని బలపర్చడానికి. అటువంటి అనుభవాలు కొన్ని వేలు ఉండవచ్చు మనందరికీ. కానీ, వాటిల్లో ఎన్ని కథలుగా మారుతున్నాయి? ఎన్ని సినిమాలుగా నోచుకుంటున్నాయి?

సినిమాలు తీస్తే అలా తియ్యాలి

మన సాహిత్యం, మన సినిమాల్లో ఈ సంఘర్షణ ఏమైనా చిత్రితమవుతూ ఉందా? మన రచయితలూ, మన దర్శకులూ మనల్ని ఉత్తేజపరచగలుగుతున్నారా? - దాదాపుగా ప్రతి రోజూ ఈ ప్రశ్నల మధ్యనే నాకు రోజు తెల్లవారుతుంది. ఏ ఒక్క పుస్తకమేనా, ప్రసంగమేనా, సినిమా, నాటకం, చివరికి ఒక్క సంపాదకీయమేనా నాకు లేశమేనా ధైర్యాన్నివగలదా అని రోజంతా గాలిస్తుంటాను. ఆధునికజీవితం అభయప్రదమని నన్ను నమ్మించగలిగినవాళ్ళు ఒక్కరంటే ఒక్కరేనా ఉన్నారా అని ఆశగా వెతుక్కుంటూ ఉంటాను.