వెన్నెల తడి

కాని ఇంట్లో సోఫాలో కూచుని ఆ సినిమా చూస్తున్నంతసేపూ బయట రెండెడ్ల బళ్ళు ఆగిఉన్నాయనీ, ఎడ్లు నెమ్మదిగా ఎండుగడ్డిపోచల్ని నెమరేసుకుంటున్నాయనీ, వాటిమీద మూడవజాము వెన్నెల రాలుతూ ఉందనీ అనిపిస్తూనే ఉంది. సినిమా అయిపోగానే ఆ ఎడ్లబండిమీద తిరిగి ఆ వెన్నెల రాత్రి అడవి దారిన మా ఊరు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నాను.

మనోజ్ఞస్వప్నాలు

శతాబ్దాలకిందటి ఏ పారశీక కళాకారులో, చిత్రకారులో అతడితో నిత్యం సంభాషణ కొనసాగిస్తూ ఉంటారనుకుంటాను. ఇక్కడ పొందుపరిచిన రెండుమూడు నమూనాలు చూడండి. ఆ నెమలి, ఆ ఏనుగు, ఆ కొంగలు- ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కావు, చెక్కమీద చెక్కిన శిల్పాలు, ఇంకాచెప్పాలంటే పాలరాతిమీద ముద్రించిన మనోజ్ఞస్వప్నాలు.

పల్లెటూరి కవిగాయకుడు

నా పసితనాన, ఆ నవల చదివినప్పుడు బహుశా నేను ఆ మాటల్నీ, ఆ పాటల్నీ దాటిన మహనీయ మనోజ్ఞలోకాన్నొకదాన్ని నాకై నేను నిర్మించుకున్నట్టున్నాను. అది అనువాదాలకు అతీతమైన ప్రపంచం.