ఇక రెండవ ప్రశ్న, ఆధునిక కథ డార్క్ రొమాంటిసిస్టు దశలోనే ఎందుకు ప్రభవించిందని? కారణం సుస్పష్టమే. కవిత్వం ఆదర్శాలు ప్రకటిస్తుంది. ఆ ఆదర్శాలు ఎక్కడ విఫలమవుతాయో,అక్కడ కథ పుట్టుకొస్తుంది. జీవితపు వైశాల్యాన్ని చిత్రించేది కవిత్వం, పగుళ్ళని పట్టుకునేది కథ. మనిషిలో అంతర్గతంగా ఉన్న వైరుధ్యాల్నీ, చీకటికోణాల్నీ, రహస్య ప్రదేశాల్నీ ఎత్తి చూపించి తద్వారా సత్యానికి మరింత సన్నిహితంగా ప్రయాణించాలని చూసిన డార్క్ రొమాంటిసిస్టుల చేతుల్లో చిన్నకథ రూపుదిద్దుకోవడంలో ఆశ్చర్యమేముంది?
ఈస్తటిక్ స్పేస్ స్టేషన్
ఈస్తటిక్ స్పేస్ కథలో కథకుడు ఒక మాటన్నాడు. ''మనుషులు స్పేస్ లో స్టేషన్లు నిర్మించి నివాసం ఉంటున్నారు గాని, తమలో దాగి వున్న ఈస్తటిక్ స్పేస్ విలువని గుర్తించడం లేదు'' అని. అందుకని మనకోసం కథకుడు నిర్మించిన ఒక ఈస్తటిక్ స్పేస్ స్టేషన్ ఈ కథాసంపుటం.
కథాశిల్పం-5
ఇటువంటి ప్రారంభాల్ని తెలుగు కథల్లోనే కాదు, ప్రపంచ కథాసాహిత్యంలో కూడా వేళ్ళ మీద మటుకే లెక్కపెట్టగలం. ఇందులో పొదుపు ఉంది, విరుపు వుంది, మెరుపు ఉంది. జివ్వున ఒంట్లోంచి రక్తం ఒక్కసారి పైకి లేచే ఉత్కంఠ ఉంది.