అమృత స్పందనలు

ఆ ఇద్దరు స్నేహితురాళ్ళనుంచీ అంత విలువైన స్పందనలూ లభించాక ఇక నాకు ఆ కథ మీద మరొకరి అభిప్రాయం కోసం ఎదురుచూడనవసరంలేదనిపించింది. అందుకనే వార్షిక సంకలనకర్తలుగానీ మరెవరేనా గానీ ఆ కథ గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా నాకేమీ అనిపించలేదు. ఒక రచన ఒక పాఠకుణ్ణి చేరితే చాలు అనుకుంటాను, అలాంటిది ఈ కథ ఇద్దరు పాఠకుల్ని చేరింది అనుకున్నాను.

మూడు ఉత్తరాలు

ఇటువంటి స్పందనలు చదివినప్పుడు టాల్ స్టాయి మాటలే గుర్తొస్తాయి. తాను రాసిన అనా కరెనినా నవల మీద తర్వాత కాలంలో వచ్చిన స్పందనల్ని చూసి 'ఈ రచనని ఇంత శ్రద్ధగా చదువుతారని తెలిస్తే, మరింత శ్రద్ధగా రాసి ఉండేవాణ్ణి ' అని. ఇటువంటి ఉత్తరాలు చూసినప్పుడు, ఈ కథలు తమ పాఠకుల్ని ఇలా వెతుక్కోగలవని తెలిసి ఉంటే, మరెన్నో కథలు రాసి ఉండేవాణ్ణి అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

అపరాహ్ణరాగం

నా జీవితంలో ఎంతోమందిని చూసాను, ఎందరో బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు. కానీ ఇప్పుడు ఈ క్షణాన్న వాళ్ళ ముఖం ఒక్కటి కూడా నా కళ్ళముందు కనిపించడం లేదు. కాని ఆ ఏకాంత అపరాహ్ణం, ఆ నిశ్శబ్దగ్రామసీమ అవి నా కోసం ఎన్నటికీ చెరగని నీడ పరిచినట్టనిపిస్తుంది. నేను ఆగిపోయిందక్కడ, ఆ నీడ దగ్గర, ఆ గూడు దగ్గర, ..’