హోల్డర్లిన్ -3

ఆకుపచ్చమీదా, కొండకోనమీదా
బొమ్మ గీసినట్టుగా కనిపిస్తున్న
అడవి అంచుల్లో నేను నడిచినప్పుడల్లా
నా గుండెలో బాధిస్తున్న ప్రతి ముల్లుకీ
గొప్ప ప్రశాంతి నన్ననుగ్రహిస్తుంది.