బసవ పురాణం-3

బసవపురాణంలో ముగ్ధ భక్తుల గురించిన ప్రసంగాల్లో మూడవ రోజు ప్రసంగం గొడగూచి కథ గురించి. ముఖ్యంగా, ఈరోజు ప్రసంగంలో, నాట్య శాస్త్రం వివరించిన ఎనిమిది రసాలూ, ఆలంకారికులు విశ్లేషించిన తొమ్మిది రసాలూ, భక్తి లక్షణకారులు మాట్లాడిన మధుర భక్తీ కూడా పాల్కురికి సోమన ప్రతిపాదిస్తున్న ముగ్ధభక్తిని వివరించలేక పోతున్నాయనీ, తెలుగు భక్తి సాహిత్యం గురించి ఒక కొత్త లక్షణశాస్త్రమే అవసరమనీ కొన్ని ఆలోచనలు పంచుకున్నాను.

బసవ పురాణం: గొడగూచి కథ

Featured image: A 19th century miniature from Salar Jung Museum, PC: Wiki commons

17-11-2023

6 Replies to “బసవ పురాణం-3”

 1. అత్యద్భుతంగా ఉంది ఈ కథ, మీరు చెప్పిన తీరు…

 2. కేవలం ముగ్ధభక్తి ప్రధానమైన గొడగూచి కథను తెలుసుకుందాం అని కాకుండా ,భరతముని ప్రతిపాదించిన అష్టరసాల గురించి చెప్పి, భారతాన్ని వింగడించడానికి అవి సరిపోవని తొమ్మిదవ రసం గురించి,వివరించి, భక్తి కూడా ఒక రసం కిందికి వస్తుందని ప్రతిపాదించి, మళ్లీ భక్తి లోని రకాలు చెప్పి , అందులో ముఖ్యంగా మధుర భక్తి ప్రస్తావన తెచ్చి, మధుర భక్తికి ముగ్ధ భక్తి తేడా ఏమిటో తెలిపి,జి.వి. సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో వచ్చిన పరిశోధన గ్రంథాన్ని ఉట్టంకించి, అందులో మీరేకిభవించని విషయం -అంటే ముగ్ధభక్తి కేవలం రౌద్ర వీర రసాలే కాకుండా కరుణ కూడా జోడించవలసి ఉంటుందని పాఠకుడి ని సమాయత్త పరచటం మీ ఉత్తమ బోధనాపటి మను తెలియజేస్తుంది.ఇక గొడగూచి కథను మీ మాటల్లో స్థూలంగా చెప్పి ఆపై సోమన రాసిన దాన్ని , దాని వచనానుభవాన్ని రెండుభాగాలుగా వివరించి చెప్పడం మనసుకు హత్తుకునేలా ఉంది.
  ఇక గొడగూచి అనే బాలిక శివదేవయ్యదంపతులు ఊరికి వెళుతూ శివునికి పాలు నివేదించమని బుజ్జగించి చెప్పడం , ఆఅమ్మాయి శుచిగా పాలు నివేదన చేస్తే శివుడు పాలుతాగా పోవడంతో రకరకాల కారణాలు పాలు తిరగకపోవడానికి కారణమేమోనని అడిగి ,అయినా తాగకపోవడంతో తలను లింగానికి బాదుకునే సమయంలో , శివుడు ఆమె భక్తికి మెచ్చి పాలుతాగడం, అలా తల్లితండ్రులు తిరిగి వచ్చేదాకా రోజు శివుడు తాగటం, వారు తిరిగిన వచ్చి పాలేవని ప్రశ్నిస్తే పాలు శివుడు తాగాడని చెబితే నమ్మక పోవడం , అప్పుడు తండ్రి కోపంతో దండించబోతే ఆ బాలిక లింగా యని వేడుకోవటం, శివుని అంగంలో ఆమెలానే అవుతుంటే తండ్రి లాగబోతూ జుట్టు కొసలు మాత్రమే చిక్కడం , ఇప్పటికీ ఇది కొనసాగుతుందని చెబుతూ ముగించడం -ఒక పాఠం చెప్పితే విద్యార్థుల మనస్సుల్లో మళ్లీ చదవాల్సిన అవసరం లేకుండా ఎలా విద్యార్థుల మనసుకెక్కించాలో అందుకు ఆ ఉపాధ్యాయుడు ఎంత సంసిద్ధుడు కావాలో ఉదాహరణగా చెప్పవచ్చు. గురుదక్షిణగా మీకు ప్రణామాలు చెబుతున్నాను.
  ఇంత దీర్ఘంగా రాయటానికి ముఖ్యంగా మీరు చెప్పిన విషయం మేమేమేరకు అవగాహన చేసుకున్నామనేకంటే దాన్ని అవగాహనపరచ డానికి మీ ప్రయత్నాన్ని మిగతా మిత్రులకు తెలియజేయడం కోసం మాత్రమే సర్. 🙏

 3. Sir, మీ ఈ ప్రసంగంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. It’s amazing to know that so much research has gone into analyzing and understanding bhakti sahityam that spanned over several centuries. Chronological గా మీరు భక్తి కవుల్ని, వారి సాహిత్యాన్ని పరిచయం చేసి, వాటిలో ప్రధాన రసం గరించి వివరించి, కొత్త రసాల్ని ( శాంత, భక్తి) చేర్చుకోవలసిన అవసరాన్ని చర్చించి, భక్తి రసాన్ని మరింత detailed గా compare-and-contrast format lo మధుర భక్తి, ముగ్ధ భక్తి గురించి చర్చించి, with examples వివరించారు. ఇక గొడగూచి కథ very sweet story of a little girl and her friendship with her Siva.
  ఆమె భక్తిని “సఖ్య ముగ్ధ భక్తి” అనడం చాలా బావుంది sir. ఈ మాట ఈ కథ context లో sweet ( తెలుగు “తియ్యగా” అంటే అర్థం మారిపోతుందేమో 😄)
  గా అనిపిస్తోంది.

Leave a Reply

%d