బసవ పురాణం-1

ప్రాచీన తెలుగు సాహిత్యంలో హిమాలయ శిఖరాల వంటి మహాకవుల్లో పాల్కురికి సోమనాథుడు ఒకడు. ఆయన శివకవుల్లో ఆగ్రగణ్యుడని మనందరికీ తెలుసు. కన్నడ దేశంలో వికసించిన వీరశైవస్ఫూర్తిని ఆయన కన్నడ జైన సాహిత్య ప్రభావంతో తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టాడు. ఆ ఒరవడిలో బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే రెండు మహాకావ్యాలు రాశాడు. అందులో బసవపురాణం లో తన సమకాలిక సమాజానికి చెందిన, ముఖ్యంగా దళిత బహుజన శివ భక్తుల కథలు గొప్ప భక్త్యావేశంతో వర్ణించాడు. ఆ కథలు వీరశైవుల కథలు, వీరభక్తుల కథలు. కానీ వాటిలో మరీ ముఖ్యంగా కొన్ని ముగ్ధ భక్తుల కథలు ఉన్నాయి. ముగ్ధభక్తి అనేది పాల్కురికి సోమన భారతీయ భక్తి సాహిత్యానికి అందించిన ఉపాదానంగా మనం చెప్పవచ్చు. అటువంటి ముక్త భక్తుల కథల్లో రుద్ర పశుపతి అనే భక్తుడి కథ ఈరోజు మనం విందాం.

నలభై నిమిషాల ప్రసంగం. మీరు డౌన్ లోడ్ చేసుకుని వీలైనప్పుడు నెమ్మదిగా వినవచ్చు.

బసవపురాణం: రుద్ర పశుపతి కథ

Featured image: Shiva Drinking Poison (detail), Nandalal Bose, PC: wikiart.org

15-11-2023

10 Replies to “బసవ పురాణం-1”

 1. సర్
  శరభయ్య మాస్టారు , మీరు కళ్ళ ముందు ఉన్నట్టు ఒక ఊహ. తాదాత్మ్యం చెందేలా ప్రసంగ ఝరి. ధన్యవాదాలు సర్

 2. ఒక ప్రత్యక్ష వ్యాఖ్యానం తో దేవ దేవుని బ్రహ్మోత్సవాలు వీక్షించిన అనుభవం, రుద్రపశుపతి కథ లో పాల్కురికి సోమన పలుకులని వినిపించారు. అక్షరాలా కార్తీక మాస ప్రవేశం జరిగినట్టుంది . ధన్యోస్మి.

 3. అద్భుతమైన కథ సర్..
  నిజంగా కదిలించి వేసింది.
  విశ్వనాథ వారి పాట..
  ఆ పరమ భక్తుని ఆవేదన కళ్ళగట్టింది.
  ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

 4. Sir, you are introducing very beautiful timeless pieces of literature to “unlettered” people like me.
  పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాశారని చిన్నప్పుడు చదువుకున్నాము. అందులో ఏముందో తెలీదు.
  ముగ్ధ భక్తి – ఆ మాటే చాలా ముద్దుగా వుంది.
  ఇక ఆ ముగ్ధ భక్తుడి కలవరం, ఆ కలవరపాటులో శివుని పై నిర్మలమైన ప్రేమ, పార్వతీదేవి ఇంకా ఇతరులపైన చూస్తూ ఊరకున్నారన్న చిరాకు ఆ ద్విపద కావ్యంలో కళ్ళకు కట్టినట్లు వ్రాసిన తీరు, your introduction to బసవపురాణం, విశ్వనాథ వారి version, structure and grammar of poetry ఎన్నో విషయాలు తెలియజెప్తున్నారు.
  Sir, can’t thank you enough for your invaluable service through your works of various kinds. 🙏🏽🙇‍♀️

Leave a Reply

%d