దిగులు కలిగినదేలనొ

ఎందుకో ఉన్నట్టుండి మనసు వర్డ్స్ వర్త్ మీదకి పోయింది. ఒకప్పుడు ఈ కవిత్వంలో అంత గాఢత లేదనీ, పునరుక్తితో పాటు అనుభూతి కూడా పలచన అనీ అనుకునేవాణ్ణి. కాని శరత్కాలపు నదిలాగా ఆ కవిత్వంలో ఆ తేటదనం గొప్ప తపస్సు వల్ల మాత్రమే సాధ్యపడుతుందని ఇప్పుడనిపిస్తోంది. కొన్ని కవితలు మీతో పంచుకోవాలని ఉంది. కాని ఆ లిరికల్ బాలడ్స్ ని ముత్యాలసరంలోనో లేదా చతురశ్రగతి గేయాలుగానో తప్ప వచనకవితలుగా తెలుగుచెయ్యలేం కదా! అందుకని ఆ కవితల్లో ఒక సుప్రసిద్ధ గీతాన్ని ఇలా ముత్యాలసరంగా మలిచి మీకు కానుక చేస్తున్నాను.


Lines Written in Early Spring

(Composed 1798, Published in Lyrical Ballads, 1798)

I heard a thousand blended notes,
While in a grove I sate reclined,
In that sweet mood when pleasant thoughts
Bring sad thoughts to the mind.

To her fair works did Nature link
The human soul that through me ran;
And much it grieved my heart to think
What man has made of man.

Through primrose tufts, in that green bower,
The periwinkle trailed its wreaths;
And ’tis my faith that every flower
Enjoys the air it breathes.

The birds around me hopped and played,
Their thoughts I cannot measure:—
But the least motion which they made
It seemed a thrill of pleasure.

The budding twigs spread out their fan,
To catch the breezy air;
And I must think, do all I can,
That there was pleasure there.

If this belief from heaven be sent,
If such be Nature’s holy plan,
Have I not reason to lament
What man has made of man?


తోట లోపల వింటి నేనొక
మధుర మంజుల మంత్రగానము
తీపి తలపులు గుప్పిగొన్నను
దిగులు కలిగినదేలనొ

లలిత సుందర లాస్య ప్రకృతి
కలిపె నాతో సకలజగతిని
మనిషి మనిషికి ఏమి చేసెనొ
తలచి మనమున కలగితిన్

తేనె వాకలు తెప్పకట్టుకు
పూలదారులు పరచె ముంగిట
విరులబాలలు మురిసిపోవుట
నాకు నిశ్చయమయ్యెడిన్

పక్షి గణములు పాట పాడెను
కూజితమ్ముల కలకలమ్ముల
సుంత రెక్కలు చాచినంతన
హర్షవర్షముకురిసెడిన్

ఫుల్ల సూచీ పల్లవమ్ములు
వీచె వింజామరములవిగో
పంచుకొంటిని పసిడి కాంతుల
చేయగలిగినదింతయే.

రమ్య విస్తరరాగ మధురిమ
దిక్కులంతట సుక్కిపోవగ
మనిషి మనిషికి ఏమి చేసెనొ
తలచి కుంగక తప్పునా?

9-11-2023

12 Replies to “దిగులు కలిగినదేలనొ”

  1. మధురం.. మీరొక ఆశ్చర్యం.. అద్భుతం నాకు..

  2. మనిషి మనిషికి ఏమి చేసెనొ తలచి వగవక తప్పునా!

Leave a Reply

%d