
పునర్యానం రెండో అధ్యాయందగ్గరే నేను మిమ్మల్ని చాలారోజులుగా ఆపేసాను. అయిదో సర్గలో చివరి కవిత ఇది. ఇరవయ్యేళ్ళ కిందటిదాకా శత్రువు అంటో ఒక మాట వినబడేది. ఆ శత్రువు బయట ఉన్నాడని రాజకీయ ఉద్యమాలు, విప్లవోద్యమాలు అంటూ ఉండేవి. కొందరు కవులూ, సంస్కర్తలూ రాసిన రాతలు చదువుతుంటే, లేదు, ఆ శత్రువు నా లోపల్నే ఉన్నాడని అనిపించేది. ఇంతకీ శత్రువు బయట ఉన్నాడో, లోపల ఉన్నాడో అతణ్ణి పగటిపూట నలుగురూ చూస్తూ ఉండగా వధించగలమో లేదా భావజాల గగనతలంలో మట్టుపెట్టగలమో, ఆయుధాలతో చంపగలమో, లేదా అరచేతుల్తో చంపగలమో ఎంతకీ తేలని చర్చ.
ఇంతకీ ఇందులో ‘శత్రు మృత్యు రహస్యం’ అనే మాట నాది కాదు. 80-81 మధ్యకాలంలో నగ్నముని రాసిన కథ ఒకటి చదివాను. అందులో జీవన మూర్తి అని ఒక పాత్ర ఉంటాడు. అతడు వాడిన పదప్రయోగం అది. నలభై ఏళ్ల కిందట తెలుగు కవులు శత్రు మృత్యు రహస్యం గురించి తీవ్రంగా అన్వేషిస్తూ ఉండే వారనడానికి ఆ మాట ఒక ఉదాహరణ.
ఈ లోగా, కాలం మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ట్రోలింగ్ యుగం. ఇక్కడ, ఇప్పుడు ప్రతి ఒక్కడూ ప్రతి ఒక్కడికీ శత్రువే. ప్రతి ఒక్కడూ తనకు నచ్చని వేషభాషల్ని, ఆహారపుటలవాట్లని, చివరకు తమకు నచ్చని దేవుళ్ళని కూడా హతమార్చడానికి నడుం బిగించేవాడే.
ఇప్పుడు మళ్ళా కదిరి నరసింహస్వామి గుడిముంగట కూచుని తలపోస్తే బహుశా చివరి వాక్యం ఇలా మారుస్తానేమో:
‘శత్రువుని చంపాలనేవాళ్ళే అంతా, అయినా
శత్రువెలా ఉంటాడో తెలిసినవారొకరూ లేరు.‘
శత్రువు బయటని వధించాలన్నారు కొందరు,
కాదు లోపల వధించాలన్నారు కొందరు.
శత్రువును మానవత్వంతో జయించాలన్నారు కొందరు,
కాదు పశువుని పశుత్వమే లొంగదీస్తుందన్నారు కొందరు.
శత్రువుని ఆయుధాలతో హతమార్చాలన్నారు కొందరు
ఆయుధాలు శత్రువుని లొంగదియ్యవన్నారు మరికొందరు.
శత్రువతో బహిరంగంగా తలపడాలన్నారు కొందరు
కాదు, చీకటిలో రహస్యంగా పోరాడాలన్నారు కొందరు.
శత్రువుని కటికనేల మీద తొడగొట్టి పిలవాలన్నారు కొందరు
కాదు, భావజాల గగనతలం మీద మట్టుబెట్టాలన్నారు మరికొందరు.
కదిరినరసింహస్వామి గుడి ముంగట కూచొని తలపోసాను
‘శత్రువుని చంపాలనేవాళ్లే అంతా, అయినా
శత్రుమృత్యు రహస్యం తెలిసినవారొకరూ లేరు’
(పునర్యానం, 2.5.15)
One argument was to kill the enemy outside, and
Some suggested killing him inside.
Kindness can overcome your enemy, some say
Others said no, eye for eye.
Weapons can kill the enemy, it was argued.
He is unbeatable, say others.
You should face him in the open, some say
Others suggest smashing him in secret.
A duel in an open field was suggested by some
Smother him in your mind, others said.
In the temple precinct of Lord Narasimha of Kadiri,
I pondered the whole question, but alas!
Everyone tells you to finish your rival, but
No one knows how.
6-9-2023
ఔనండీ శత్రువు లోపలి వాడే
ధన్యవాదాలు మేడం
“ఇప్పుడు ప్రతి ఒక్కడూ ప్రతి ఒక్కడికీ శత్రువే…”
ఇక వేరే అక్కర్లేదు…సర్. ఇది చాలు.
ధన్యం….
మీ స్పందనకు ధన్యవాదాలు రామ్ భాస్కర్!
Everyone tells you to finish your rival, but
No one knows how.
లోకంలో తనకు తాను
వేరౌతున్నాడు మనిషి
లోపలి శత్రువు నెరుగక
దూషిస్తున్నాడు కినిసి
మరో భయంకర శతృవు పుట్టుకని ఆపటానికి
శతృవుని భౌతికంగా మట్టుపెట్టా
లేమో…దేనికైనా లోపలి శతృవే కారణం అన్నది సత్యమే.
మంచి పాయంట్ ని స్పృశించారు సర్.
ధన్యవాదాలు మేడం