
పునర్యానం మొదటి అధ్యాయంలో మొత్తం అయిదు సర్గలు, 102 కవితలు ఉన్నాయి. వాటిల్లో నా చిన్నప్పటి అనుభవాల్నీ, ఆ తర్వాత నేను చూస్తూ వచ్చిన సౌందర్యాన్నీ కవితలుగా మార్చడానికి ప్రయత్నించాను. వాటిల్లోంచి చిన్న కవితలు, అనువాదానికి వీలుగా ఉండే కవితలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఆ వరసలో మరొక కవితతో, ఆ అధ్యాయాన్ని ముగిస్తున్నాను.
చిన్నప్పుడు ఆ రేగు చెట్టు కింద నీకు తలంటి
నీళ్లు పోసింది అమ్మ గుర్తుందా,
అప్పుడు నీవెంత మారాం చేసావని.
తొలి వానచినుకులు తనని తాకగానే
చూడు పృథ్వి తీస్తున్న వేడి శ్వాసలు
మారాం చేస్తున్నవింకా
మొదలయ్యిందింతలో అభ్యంగనస్నానం.
ముందు కళ్లెత్తి తేరిపార చూసావు, అప్పుడు రెండు చేతుల్తో కళ్లు మూసుకుని
తలదాల్చావు మీద పడుతున్న స్నాన జలాల్ని
పరిశుభ్ర పడుతున్నావనుకున్నావేమో
ఇక వదిలేస్తావా చేతుల్ని కూడా
వళ్లంతా ఒకటే ధారలు
అప్పుడు తల తుడిచింది, చెదిరాయి నీటి తునకలు చుట్టూ
కళ్లు కొద్దిగా ఎరుపెక్కాయి.
‘ఒక ఉప్పు రాయి నోట్లో వేసుకో, తగ్గుతుంద’న్నారెవరో
వాన వెలిసిన లోకంలాగా మహరాజులా ఉన్నావందమ్మ
(పునర్యానం,1.4.7)
When you were a child, do you remember,
Your mother anointed you under the jujube tree
While you pestered, your head bath began.
Around you, vapors like summer rain.
You stared, then closed your eyes and marveled at the water
Later, even removed your hands from the eyes.
The water streamed over you.
Droplets spilled over your body as she wiped your head, and
Your eyes reddened.
Salt cures irritation, someone suggested.
‘It’s like the world after a rain, and
You shine like a king’, mom said.
4-8-2023
ఉప్పు రాయి నోట్లో వేసుకోవడం!
Beautiful poem!
Missed you in the morning, but heard the sad news later..take care.
ధన్యవాదాలు
వాన వెలిసిన లోకంలాగా.. మహరాజు!
ధన్యవాదాలు సార్
చిన్ననాటి అనుభవాలు కవితల్లో “వాన వెలిసిన లోకంలా” మరింత వైభవంగా వున్నాయి, సర్.
ధన్యవాదాలు మాధవీ!