
పునర్యానం కావ్యాన్ని నిర్మించడానికి నాకు తైత్తిరీయ ఉపనిషత్తు దారి చూపించింది. అందులో వివరించిన పంచకోశ జాగృతి వెలుగులో నా జీవితానుభవాన్ని పరిశీలించుకున్నాను. (ఇప్పుడు నూతన విద్యావిధానం కూడా పంచకోశ జాగృతి ప్రకారమే భారతీయ విద్యాలక్ష్యాల్ని నిర్వచిస్తున్నది). ఉపనిషత్తు చెప్పిన దాని ప్రకారం మనిషి మొదట అన్నమే సమస్తమూ అని అనుకుంటాడు. ఇక్కడ అన్నం అని అంటున్నప్పుడు అది మొత్తం పార్థివ జీవితానికి చిహ్నంగా భావించాలి. అంటే మన స్థూల జీవితం అన్నమాట. నేను దాన్ని పృథ్వి అనే అధ్యాయంగా తీసుకున్నాను. అందులో మొత్తం అయిదు సర్గలు, 102 కవితలు ఉన్నాయి. వాటిలో నేను నా పుట్టుకని, బాల్యాన్ని, మా గ్రామాన్ని, అడవిని, కొండల్ని, ఏటిని, భూమ్యాకాశాల్ని, నాకు పరిచయమైన ప్రపంచాన్ని నేను తొలిసారి చూసినప్పటి మెలకువతో వర్ణించడానికి ప్రయత్నించాను. అది నా పార్థివ శరీరం. అది లేకపోతే నేను లేను. అందుకని ఆ అధ్యాయాన్ని ‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ ‘ ( తై.భృగువల్లి, అ.2) అనే మాటతో మొదలుపెట్టాను. అన్నమే పరమసత్యమని అతడు తెలుసుకున్నాడు అనే ఆ స్ఫురణ నా ఆత్మజాగృతికి తొలిమెట్టు మాత్రమే.
ఉదయకాలపు ఎండలో పరిభ్రమిస్తున్నాను, ఇల్లు లేదు, కిటికీల్లేవు, ప్రాంగణం లేదు
ఆకాశపు ఆ కొస నుంచి ఈ కొసదాకా గుమ్మడిపూలు పూచిన ఎండ
శీతాకాలపు ఉదయాల ఎండ చాలు, ఒక జీవితాన్నిట్లా నిశ్చింతా గడిపేస్తాను
ముందు చలి, అప్పుడు తొలగుతాయి మంచుతెరలు
ఎక్కణ్ణుంచో పాకుతూ వచ్చిన పూలతీగెలా నిన్ను తాకుతుందప్పుడు సూర్యకాంతి
శీతాకాల ప్రభాత సూర్య రశ్మిని నేను చూడను, స్పృశిస్తాను
అది పాలమీద మీగడలా, పసుపు రాసిన గడపలా తేమగా తగుల్తుంది
ప్రేమించిన రాత్రుల్నొదల్లేని సోమరి తనాన్ని మన కోసం పొడిగిస్తుంది
పనులన్నీ వాయిదా పెట్టేస్తాను, అన్నిటికన్నా ముందు ఆ కౌగిలింత
అప్పుడే పొదుగుల్లోంచి కురిసిన పాల నును లేత వెచ్చదనంతో
ఆ ఎండ నన్నో లేగని చేస్తుంది
ఆవు మెత్తగా తన నాలుకతో నా వళ్లంతా నాకినట్టు సూర్యకాంతి
ఎన్ని అనుభవాలు విసిగించనివ్వు, శీతాకాల ప్రత్యూషం
పునరుదయిస్తుందని నమ్మకముంటే చాలు
ఎండ పూన్చి వెలుగు తేరులో నా కోసం ఇల్లు కట్టుకుంటాను,
ఎందరికయినా చోటుండే ఆ పుష్పకాన్నెక్కే మరో సోమరి ఎవరా అని ఎదురుచూస్తుంటాను
(పునర్యానం, 1.1.3)
Like a pumpkin flower, the sunrise spread its petals
Like a pumpkin flower, the sunrise spread its petals.
A stroll in the early morning sun, sans door, fence, or yard, begins.
December’s morning light is sufficient for living a full life.
First, you will see dew, then snow melting
As if you are entwined in a flowering creeper, the morning sunlight enfolds you.
Smooth, like fresh turmeric on a door-sill or cream on milk.
Winter’s lazy nights extend into the morning, and
It’s time to put all my tasks on hold.
Like a cow licking its calf, the early sun shines on me,
A hundred worries vanish before the promise of a December morning.
In the temple of morning light,
I will build a nest and eagerly wait for another lazy soul.
30-7-2023
What a beautiful poem sir.నేనో మల్లినాథ సూరినైతే ఎంత బావుండేది.
ధన్యవాదాలు సార్
Lovely poetry, sir.
Thank you
చూడగానే పెయింటింగ్ హృదయానికి హత్తుకుంది.
అప్పుడే పొదుగుల్లోంచి కురిసిన పాల నును లేత వెచ్చదనంతో
ఆ ఎండ నన్నో లేగని చేస్తుంది
ఆవు మెత్తగా తన నాలుకతో నా వళ్లంతా నాకినట్టు సూర్యకాంతి
ధన్యవాదాలు మిత్రమా!
మీ ఓ శీతాకాలపు సూర్యరశ్మి లో తడిసిన దారులై వుంటాయి ఆ painting లో. 😊
పూలతీగెలా తాకే సూర్యకాంతి, శీతాకాల ప్రభాత సూర్య రశ్మిని స్పృశించడం, ఎండ పూన్చి వెలుగు తేరులో ఇల్లు కట్టుకోవడం – ఎండాకాలంలో శీతాకాలాన్ని నిలిపారు.
“(ఇప్పుడు నూతన విద్యావిధానం కూడా పంచకోశ జాగృతి ప్రకారమే భారతీయ విద్యాలక్ష్యాల్ని నిర్వచిస్తున్నది)”
Would you kindly explain a little more on this, sir? 🙏🏽
ధన్యవాదాలు మాధవీ మీ స్పందనకు.
నూతన విద్యా విధానంలో పంచకోశ జాగృతి గురించి మళ్ళీ వివరంగా రాస్తాను.
Mist lifting ?
మీ అనుభవాలన్నీ వ్యక్తిగతమూ ,సార్వజనీనమూ కూడా. బెంగళూరు చలికాలాల్లో ,ఓ దుప్పటి కప్పుకొని సూర్యుని కోసం ఆశగా ఎదురు చూసిన చిన్నపిల్ల ఇంకా నా లోపల వుంది.
ధన్యవాదాలు మేడం
‘Like a cow licking its calf, the early sun shines on me’ – what a beautiful line sir
Thank you
Thanks for the lovely poem . The image of December morning rangolis adorned with vibrant yellow pumpkin flowers comes to mind, a gracious welcome to the sun’s golden embrace.
Thank you so much sir