
తెల్లవారకుండానే
పక్షులు చెట్టుతో పాటు
నన్నూ లేపుతుంటాయి
అప్పుడు నేనొక తల్లిగా మారిపోతాను.
కిటికీదాటి నా చీరచెరగు
చెట్టుమీద పరచుకుంటుంది.
నా వక్షంలో పాలు పొంగడం మొదలవుతుంది.
తెల్లవారుతుంది.
చిన్ని చిన్నినోళ్ళతో
పిట్టలు
బంగారం కొరికి పడేస్తుంటాయి
వాటికి కావలసింది
పూల గిన్నెల్లో మెరిసే చిన్ని తేనెబొట్లు.
పొద్దెక్కేటప్పటికి
నేను చెట్టుగా మారిపోతాను
చిన్ని చిన్ని ముక్కుల్తో
అవి నన్ను పొడిచినచోటల్లా
పచ్చని కితకితలు.
6-6-2023
పచ్చని కితకితలు
మీ కవితలు చాలా బాగున్నాయి. వీటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించిన బాగుంటుంది. -పి.కూర్మేశ్వర రావు, ( మీరు పార్వతీపురం ఐ.టి.డి.ఏ.లో ట్రైబల్ వెల్చేరు అధికారి గా పని చేస్తున్నప్పుడు,నేను అచ్చట వయోజనవిద్య ప్రోజెక్టు అధికారిగా పనిచేసాను. మీతో పాటు,ఐ.టి.డి.ఏ.ప్రోజెక్ట్ అధికారిగా పనిచేసిన శ్రీ ఎల్.వి.శుభ్రహ్మమణ్యం గారి తో కలిసి పార్వతీ పురం గిరిజన ప్రాంతంలో విద్య, వయోజనవిద్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది)
ధన్యవాదాలు సార్! మిమ్మల్ని ఇన్నేళ్ల తర్వాత ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
పచ్చని కితకితలు 🙏
ధన్యవాదాలు
పచ్చని కితకితలా? భలే
ధన్యవాదాలు
పచ్చని కితకితలా? భలే.
పచ్చని కిత కితలా? భలే
హృదయంగమ నైవేద్యం.
ధన్యవాదాలు సార్