ప్రేమ మరక

రోహిణికార్తె చివరిదినాలు.
పొద్దున్న పదిగంటలకే
ఫైరింజనువాళ్ళ సైరనులాగా ఎండ.

పంచాగ్నిమధ్యంలో
సంగీత సాధనచేస్తున్నట్టు
పచ్చపూల చెట్టు.

ప్రాక్టీసు చేసిన పాటలన్నీ గాల్లో కలిసిపోయాక
చివరి రాగంలాగా
వెచ్చని పరిమళం.

నీడల్ని పీల్చుకుంటున్న కొమ్మల మధ్య
చిట్టచివరిపూలూ పిట్టలూ
కూడబెట్టుకున్న తేనె.

ప్రేమించినవాళ్ళు వెళ్ళిపోతూ
వదిలిపెట్టిన ప్రేమమరక.
ఎంత రుద్దినా చెరగని కస్తూరి.

5-6-2023

14 Replies to “ప్రేమ మరక”

 1. ఎంత రుద్దినా చెరగని కస్తూరి
  ఒకే ఒక్కసారి ఆ అనుభవం పొందాను. నిజం
  ప్రస్తుతం మాసికంగా అలాంటి చెరగని అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాను.హృదయస్పర్శి కవిత.

 2. మీరు వదిలి పెట్టిన అక్షర అస్త్ర శాస్త్రలు
  పరిమళించిన మానవతకు ఆనవాలు..
  మీ దస్తుారి ( Writings )
  మా జీవితలకు అద్దిన కస్తూరి 🙏

 3. పంచాగ్ని మద్యం లో పచ్చపూల చెట్టు లాఉంది కస్తూరి మరక

 4. చిట్టచివరిపూలూ పిట్టలూ
  కూడబెట్టుకున్న తేనె

  మీ కవితలు కూడా నాలాంటి తేనెటీగ కూడబెట్టుకున్న తేనె అవుతుంది గురువుగారు

 5. జీవిత మార్మికత కు కస్తూరి పరిమళాన్ని అద్దారు. అద్భుతం.

Leave a Reply

%d bloggers like this: