మధురనిరాశ

ఈ రోజంతా బొమ్మలు గీస్తో గడిపేను. ఎంత సేపు గడుపు, ఎంత శ్రద్ధ చూపించు, ఎంత ఇష్టం ప్రకటించు- అయినా తృప్తిచెందని ప్రియురాలు అంటూ ఉంటే, ఈ లోకంలో, అది చిత్రకళ మాత్రమే. ఎంతసేపు రంగుల్తో గడిపినా చివరికి మిగిలేది, అసంతృప్తి, a terrible feeling of hopelessness. కాని, అది చాలా మధురనిరాశ. కబీరు అన్నాడే: ప్రేమ గురించి చెప్తూ- ఊరంతా తగలబడ్డా కూడా మళ్ళా పక్కింటికి నిప్పుకోసం పోయినట్టు ఉంటుంది అని. చిత్రకళ కూడా అంతే. నాకేమీ చాతకాదు, నేను విఫలమవుతున్నాను, రంగులు కలపలేకపోతున్నాను, వెలుగునీడల్ని పట్టుకోలేకపోతున్నాను-ఇలా ఎంతసేపు నీలో నువ్వు కుమిలిపోయినా, మళ్ళా నీళ్ళ పాత్ర నింపుకుని తెచ్చుకోవాలనే ఉంటుంది, మళ్ళా తెల్లకాగితం చేతుల్లోకి తీసుకోవాలనే ఉంటుంది, మళ్ళా రంగులు కలపడం మొదలుపెట్టాలనే ఉంటుంది.

30-5-2023

19 Replies to “మధురనిరాశ”

  1. లలిత కళా పిపాసులు మీరు. ధన్యులు.
    శుభోదయ నమస్సులు.

  2. గురువు గారు మీరు మనో నేత్రం తొ చూసినవా, లెక మాములు నేత్రం తొ చూసినవా ?

  3. ముగ్ద మనోహరంగా ఉన్నాయి మీ చిత్రాలు.
    ఒక చిత్రకారుడికి అసంతృప్తితో అసంపూర్తిగా మిగిలిన చిత్రాలు చిత్రకారుని సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తెలుపుతాయేమో ….

  4. ముగ్ధ మనోహరంగా ఉన్నాయి మీ చిత్రాలు
    ఒక చిత్రకారుడి అసంపూర్తి అసంతృప్తి చిత్రాలు చిత్రకారుని పూర్ణ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తా యేమో

  5. మీరు రాసే ఇవన్నీ ఇలా చదువుతూ ఉంటే
    నాలో తెలియని అలజడి మరింత పెరుగుతుంది
    మాట్లాడలేని చదవలేని రాయలేని నిద్రపోలేని అలజడి
    మీరు ప్రతి అక్షరానికి ప్రేమలో ఉన్నాను నేను

    1. మీ ప్రతి అక్షరానికి ప్రేమలో ఉన్నాను నేను

  6. మీక్కూడా అలా అనిపిస్తోందంటే మాకెంత ధైర్యంగా వుందో.

  7. మీ చిత్రాలు,కవితలు అన్నీ కూడా మీమనసును ప్రతిబింబిస్తాయి.మనో నిల్మలత ఉన్నవారికే అది సాధ్యం.అందుకే అవి రమణీయతను సంతరించుకుంటాయి.ఆశీస్సులు

Leave a Reply

%d bloggers like this: