శీతవేళ

శీతవేళ, నీటిరంగులు, ఎ 4, 500 జిఎస్ఎం

ఫిబ్రవరిలో మహబూబ్ నగర్ లో అడవికి వెళ్ళినప్పటి దృశ్యాల్లో ఒకటి. నిన్న విన్సర్ అండ్ న్యూటన్ రంగులు తెచ్చుకున్నాను. వాటితో ఈ రోజంతా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. అందులో ఇదొకటి. మామూలుగా ఇటువంటి దృశ్యాలు సాప్ట్ పేస్టల్స్ తో చిత్రించదగ్గవి. సంజీవదేవ్ గారు ఇటువంటి చిత్రాలు ఎంతో భావస్ఫోరకంగా ఆయిల్ పేస్టళ్ళల్లోనూ, సాఫ్ట్ పేస్టళ్ళలోనూ చిత్రించారు. యోసా బూసా లాంటి హైకూ కవి తన కవితల్లో చూపించే ఇటువంటి దృశ్యాలను నీటిరంగుల్లో పట్టుకోడానికి ప్రయత్నించడం కొద్దిగా కష్టమే.

20-5-2023

6 Replies to “శీతవేళ”

  1. కనరో భాగ్యము… కర కమలపు కుంచె కథ!

  2. స్ఫూర్తిమంతం మీ సాధన.
    శిశిర నీహారపటల మచ్చెరువుగాగ
    అని బుద్ధుని గురించిన కవిత ఎవరిదో గుర్తు రావటం లేదు. మీరు పుట్టిన సంవత్సరంలో నాగార్జున వాచకం ఆరవతరగతి తెలుగు కొత్తగా వచ్చింది. అందులోది. నేను డబుల్ ప్రమోషన్‌తో ఆ సంవత్సరం ఆరవతరగతి లో చేరాను.
    ఆ శిశిర నీహార పటలం మీ పటంలో అద్భుతంగా చిత్రించారు.

  3. నీటిరంగు అద్భుతంగా వచ్చిందండీ.

Leave a Reply

%d bloggers like this: