ఒక మాట

ఉదకదొళగె బయ్చిట్ట బయ్యేయ కిచ్చినంతిద్దిత్తు

ససియొళ గణ రసద రుచియంతిద్దిత్తు

ననెయొళగణ పరిమళదంతిద్దిత్తు

కూడల సంగమదేవర నిలవు

కన్నెయ స్నేహదంతిదిత్తు

(నీటిలో ఒదిగి ఉన్న నిప్పులాగా, సస్యములో ఒదిగి ఉన్న రుచి లాగా,  మొగ్గలో ఒదిగి ఉన్న పరిమళం లాగా, కూడల సంగమదేవుని ఉనికి కన్యలో ఒదిగి ఉన్న స్నేహము వంటిది)

బసవణ్ణ


1980-81 మధ్యకాలంలో నేను కథలు రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో ఆర్.ఎస్.సుదర్శనంగారి సాహిత్యవ్యాసాలు నన్ను గాఢంగా ప్రభావితుణ్ణి చేసాయి. కావ్యాల్లాగా ఉండే నవలలు తెలుగులో రావాలని ఆయన కోరుకున్నారు. ఆ స్ఫూర్తితో ‘అసంపూర్ణ మథనం’ అనే ఒక నవల 1981 లో రాసాను. దాన్ని ఆయనకి చూపించినప్పుడు బావుందని చెప్తూ, ‘అసంపూర్ణ’ అనే పదం తీసేసి, ఆ నవలని ప్రచురించవచ్చని చెప్పారు. కాని నాకే ఆ రచన తృప్తిగా అనిపించలేదు. మధిరకు చెందిన చంద్రశేఖర ఆజాద్ అనే మిత్రుడు ఆ రచనని ఇష్టపడితే ఆ రాతప్రతి ఆయనకి ఇచ్చేసాను. ఆ తర్వాత 1982 లో ‘అరణ్యం’ అనే నవల రాసాను. నండూరి రామ్మోహనరావుగారికి అది నచ్చింది. ఆయన దాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీరియలైజ్ చేసారు. నవోదయ రామ్మోహనరావుగారు దాన్ని నవోదయ తరఫున 1987 లో ప్రచురించారు. కాని ఆ రచన కూడా నాకు తృప్తినివ్వలేదు.

1982-87 మధ్యకాలంలో, టాల్ స్టాయి ‘ఫామిలీ హాపీనెస్’, టాగోర్ ‘నష్టనీడ్’, బిభూతి భూషణ్ ‘ఆరణ్యక’, వైకం మహమ్మద్ బషీర్ ‘బాల్యకాల సఖి’, చింగిజ్ ఐత్ మాతొవ్ ‘జమీల్యా’ వంటి రచనలు చదివాక, కావ్యత్వం పొందిన నవలలు ఎలా ఉంటాయో అర్థమయింది.

ఆ రచనల స్ఫూర్తితో ఈ నవల 1987 లో రాయడం మొదలుపెట్టాను. అప్పటికి నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా విజయనగరం జిల్లాలో ట్రైనింగులో చేరాను. ఆ ట్రైనింగులో చాలా ఊళ్ళు తిరుగుతూ ఉండటంతో, ఆ రచన ముందుకు సాగలేదు. రాసిన ముప్ఫై, నలభై పేజీలు కూడా ఎక్కడో పోగొట్టుకున్నాను. తిరిగి మళ్లా 2002 దాకా ఒక నవల రాయగల స్తిమితం నాకు చిక్కలేదు. 2002 లో సి.సుజాత గారి సంపాదకత్వంలో మొదలైన ఒక మాసపత్రికలో ‘ఆ వెన్నెల రాత్రులు’ పేరిట ఇందులోని మొదటి అధ్యాయం ప్రచురణకు నోచుకుంది. కాని ఆ పత్రిక రెండో నెలకే మూతపడటంతో, అప్పుడు రాసిన రెండవ అధ్యాయం కూడా ప్రచురణకు నోచుకోకపోగా, అది కూడా  పోగొట్టుకున్నాను. చివరికి ఇన్నాళ్ళకి, అంటే ఈ రచన మొదలుపెట్టిన 36 ఏళ్ళ తరువాత, ఇలా పూర్తిచేయగలిగాను. నా జీవితంలో సుదీర్ఘకాలం తీసుకున్న రచనగా ఇది మిగిలిపోతుంది.

1987 లోనో, 2002 లోనో ఈ నవల పూర్తయి ఉంటే, ఈ రచన ఎలా ఉండి ఉండేదో ఊహించలేకపోతున్నాను. కాని ఇప్పుడు అరవై ఏళ్ళు దాటాక చేసిన ఈ రచనని చూసుకుంటే, టాగోర్‌, ‘ఫలసేకరణ’ లోని ఈ కవిత నాకు గుర్తొస్తోంది:

వసంత పవనుడు యాచించ వచ్చినప్పుడు, తన సమృద్ధిలోంచి ఒకటి రెండు రేకుల్ని రాల్చి కూడా ఏ మాత్రం తరుగుపోని పువ్వు మల్లే వుండేది నా చిన్నతనపు జీవితం.

ఒక్క రవ్వ ఎటూ పోనీక, తన మధురభారాన్నంతా సంపూర్ణంగా అర్పించుకోవాలనే ఫలం వలె వుంది నా యవ్వనాంత జీవితం.

మా బాల్యకాలమిత్రుడు, మా ఊర్ని ఎంతో ప్రేమించిన శ్రీధర మల్లికార్జున్‌ ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు.  అతను జీవించి ఉండగా అతనికి నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఈ పుస్తకం తనకు కానుకచేస్తున్నానని తెలిస్తే తప్పకుండా మురిసిపోతాడని నమ్ముతున్నాను.

వైశాఖ పౌర్ణమి, 5-5-2023


ఈ రచనలోని సాంకేతికమైన అంశాలమీద జరిగిన చర్చలకు ప్రధానంగా ఈ రచనలకు ఋణపడి ఉంటాను.

1.   The Immense Journey, Loren Eiseley (1957)

2. The Unexpected Universe, Loren Eiseley (1969)

3. A Wilder Time, Notes from a Geologist at the Edge of the Greenland Ice, William E Glassley (2018)

4. The Sea Around Us, Racherl Carson (1951)

5. Sapiens, A Brief History of Mankind (Chapter 1), Yuval Noah Harari (2015)

6. Otherlands, A World in the Making, Thomas Holliday (2022)

7. The Hidden life of Trees, What they Feel and How they Communicate, Peter Wohlleben (2015)

8. Science Shows Why You’re Smarter Than a Neanderthal, Joseph Stromberg, https://www.smithsonianmag.com/science-nature/science-shows-why-youre-smarter-than-a-neanderthal-1885827/

9. How Humans Survived the Ice Age, Sam Walters, https://www.discovermagazine.com/planet-earth/how-humans-survived-the-ice-age

పర్వతాలు, తూర్పుకనుమల ఆవిర్భావం

10. How to Make Mountains: Marcia Bjornerud  https://aeon.co/essays/when-geology-left-solid-ground-how-mountains-came-to-be

11. Eastern Ghats- The New Kid on the Block http://suvratk.blogspot.com/2019/04/eastern-ghats-new-kid-on-block.html

12. Relative chronology in high-grade crystalline terrain of the Eastern Ghats, India: new insights: S.Bhattacharya, Rajib Kar, Amit Kumar Saw https://www.scirp.org/html/8602.html

13. Evolution of the Eastern Ghats Belt, India: A Magmatic Perspective, K.VIjayakumar, abstract of the lecture https://link.springer.com/content/pdf/10.1007/s12594-021-1657-7.pdf

భారతీయ వృక్షజాతులు, తూర్పు కనుమల్లో వృక్షజాతులు

14. Indian Trees, Dietrich Brandis, 1921, https://archive.org/details/in.ernet.dli.2015.222894

15. Tree Flora in Eastern Ghats of Southern Peninsular India: S.Sandhyarani, K.Sriirama Murty and T.Pullaiah  https://scialert.net/fulltext/?doi=rjb.2007.176.185

16. Tree species diversity in the Eastern Ghats of northern Andhra Pradesh, india: M. Tarakeswara Naidu  & O. Aniel Kumar https://threatenedtaxa.org/index.php/JoTT/article/view/2112/3274

తూర్పుకనుమల్లో పక్షులు, సీతాకోక చిలుకలు

17. The Seasonality and Occurrence of Birds in the Eastern Ghats of Andhra Pradesh India: T.D.Price (1979) https://archive.org/details/biostor-147937

18. A preliminary checklist of butterflies from the North Eastern Ghats with notes on new and significant species records, including three new reports for peninsular India Rajkamal Goswami, Ovee Thorat, Vikram Aditya & Seena Narayanan Karimbumkara https://threatenedtaxa.org/JoTT/article/view/3730/6057

మానవవిజ్ఞాన శాస్త్రం

19. Anthropology: Carol R Ember, Melvin Ember, Peter N peregrine, Pearson 2015

20. An Introduction to Anthropological Thought: Makhan Jha, Vikas Publishing House,1983

21. Ruth Benedict and the Purpose of Anthropology: Ryan Wheeler https://peabody.andover.edu/2017/01/14/ruth-benedict-and-the-purpose-of-anthropology/

కొండరెడ్లు

22. The Reddis of the Bison Hills, A Study in Acculturation: Christophe Von Furer-Haimendorf (1945) https://archive.org/details/in.ernet.dli.2015.283671

ఆదివాసుల పండగలు

23. ఆదిబసి లొకొర్ పొరొబ్ కత,  గొలోరి రామ్, ఊవె గుస్టాఫ్ సన్, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, పాడేరు, 1988

యాత్రా చింతన

24. The Vagabond’s Way, Rolf Potts (2022)

ప్రస్తావించిన పుస్తకాలు

25. The Testimony of the Rocks; Or, Geology in Its Bearings on the Two Theologies, Natural and Revealed, Hugh Miller, 1875 https://www.gutenberg.org/ebooks/28248

26. My First Summer in the Sierra, John Muir, 1917 https://www.gutenberg.org/ebooks/32540

27. Things Fall Apart, Chinua Achebe, 1958

పక్షుల పిలుపులు

YouTube videos: Indian Birds Sounds – Part 1 to 7 @IndianBirdVideos #indian_bird_sounds# bird_calls

ధన్యవాదాలు

జియాలజిస్టు ఫీల్డ్ వర్క్ గురించి వివరించిన భూగర్భ విజ్ఞాన శాస్త్ర అధికారి రాజబాబుగారికి,

తూర్పుకనుమల అడవుల్ని అటవీ శాఖ దృక్కోణం నుంచి స్వయంగా దగ్గరుండి పరిచయం చేసిన జిల్లా అటవీ అధికారి, నారాయణపేట్ జిల్లా, తెలంగాణా ప్రభుత్వం, శ్రీమతి దేవనపల్లి వీణావాణి గారికి,

కొండరెడ్ల పండగల గురించి వివరించిన అటవీ రేంజ్ అధికారి, రాజవొమ్మంగి, శ్రీ మడకం అబ్బాయి దొర గారికి

అమిరేకల గ్రామం నుంచి కొండరెడ్ల పాటలు సేకరించిన నోరి దత్తాత్రేయకు


ప్రతిరోజు ఈ రచనను ఆసక్తిగా చదివి రచయితను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చిన మీకందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.

10 Replies to “ఒక మాట”

 1. ఆ రచనకు తెలుసు ఎప్పుడు పరిపక్వమవ్వాలో .
  మీ ప్రశాంత విశ్రాంత చిత్తాన్ని అభిలషించింది. నిన్ననే అనుకున్నా వైశాఖ పున్నమి నాడు ముగిసింది వెన్నెల రాత్రుల వచనకావ్యం అని.
  మరో వచనకావ్యం కై ఎదురు చూస్తూ ఉంటాం. మనఃపూర్వక అభినందనలు. వైశాఖ పున్నమి బొమ్మ వేసాను మిమ్మల్ని తలచుకుంటూనే.అది ఇక్కడ పోస్టవటం లేదెందుకో ఎఫ్బీలో పెట్టాను. అది మీకే సమర్పితం .

   1. That’s incredible sir!! The amount of research, creative and physical energy and time that has gone into producing a కావ్యత్వం పొందిన నవల!! Superb! 🙏🏽

 2. An excellent presentation! A full information of nature, forests, geology, tribal life and culture of the area making the reader feel his own presence there as a part of the activity! Congratulations sir. Also our sincere thanks to the officers mentioned for sharing their wide knowledge of life and culture in the area, and related biota.

 3. కన్య స్నేహం బసవణ్ణ నుండి నిరీక్షించలేదు .రచన చరిత్ర చదివితే అనిపించిన మాట :ఈ రచన ఇంతకన్నా చాలా ముందే వచ్చినట్లైతే కావ్యాత్మకమైన నవల అయ్యేది .కాని ఓ యువతి మనసుని అడవి నేపథ్యంలో ఇంత సహజమైన శైలిలో విశ్లేషించగలిగేవారు కాదు .ఏది జరిగినా మన మంచికే అన్న నానుడి ఇలాంటి అనుభవంనుండే వచ్చుండాలి .
  ధన్యవాదాలు సర్

Leave a Reply

%d bloggers like this: