
This February was the hottest in India since 1901, the earliest year for which data is available.
The Hindustan Times, 1 March 2023
నా ఎదుట ఉన్న ఫోటోలో
చిన్నప్పటి ముఖాన్ని వెతుక్కున్నట్టు
ఈ మార్చి ఎండలో
ఒకప్పటి వసంతాన్ని పోల్చుకుంటున్నాను.
ఒక కోకిల ఇంకా రాకపోవడానికి
నాతో పాటు సమస్త ప్రపంచం
కారణమని తెలుసుకున్నాక
చెట్లు చిగురించనిలోకంలో
నేనే చిగురించాలని తెలుసుకున్నాను.
కోకిల ఎక్కడుందో పిలవడానికి
నేనే ఒక కుహూరవంగా మారుతున్నాను.
వేడెక్కుతున్న భూమిని
నేనిట్లా చల్లపరచడం మొదలెట్టాక
నా దారిన వన దేవతలు కూడా
నడక మొదలు పెడతారు.
30-3-2023
ఒక పచ్చని కవిత…వెచ్చని కుహూరవం గా మారిన ఉదయం!
శుభోదయం…
ధన్యవాదాలు
నా దారిలో వన దేవతలు కూడా నడక మొదలు పెడతారు…. భలే గొప్ప ఫీల్ సర్
ధన్యవాదాలు
‘చెట్లు చిగురించనిలోకంలో
నేనే చిగురించాలని తెలుసుకున్నాను.’
చాలా బావుంది సర్. లోలోపలే చిగురించినంత హాయిగా..
ధన్యవాదాలు
చాలా బాగుంది సార్
ధన్యవాదాలు
అంతే కదండీ ,ఏదైనా ‘నా’ తోనే మొదలవ్వాలి.ఆ నా మొత్తం సమాజం కావడానికి ఎంత కాలం పడుతుందో !
ఇది మీకు సమర్పిస్తున్నాను సర్.
*అదృశ్య దృశ్యం
ఎద కనుమలనుండి
పదాలు ఒకదాని వెనుక ఒకటి
గొఱ్ఱెదాటుగా సాగుతాయి
నేను నా కలంతో వాటిని అదిలిస్తుంటా
మంద ముందుకు సాగుతుంది పచ్చిక బీళ్లలో
నేను పిల్లనగ్రోవితో కోకిలనవుతా
౼తుమ్మూరి రాంమోహన్ రావు
THE INVISIBLE SIGHT
Through the ridges of heart
Words leap like the sheep
And line up one after another
With my pen I ride the herd on…
The herd moves on in meadows
And with my flute I become a kuckoo
– Thummuri Rammohan Rao
Translation: Dr.T.Sharath Babu
ఇది మీకు సమర్పిస్తున్నాను సర్.
అదృశ్యదృశ్యం
ఎద కనుమలనుండి
పదాలు ఒకదాని వెనుక ఒకటి
గొఱ్ఱెదాటుగా సాగుతాయి
నేను నా కలంతో వాటిని అదిలిస్తుంటా
మంద ముందుకు సాగుతుంది పచ్చిక బీళ్లలో
నేను పిల్లనగ్రోవితో కోకిలనవుతా
౼తుమ్మూరి రాంమోహన్ రావు
THE INVISIBLE SIGHT
Through the ridges of heart
Words leap like the sheep
And line up one after another
With my pen I ride the herd on…
The herd moves on in meadows
And with my flute I become a kuckoo
– Thummuri Rammohan Rao
Translation: Dr.T.Sharath Babu
ప్రతి నడక ఒక అడుగు తోనే
మొదలవుతుంది.. మీ కుహూరవానికి… ప్రతి కోకిల స్పందిస్తుంది!!
👌👌
ధన్యవాదాలు