ఉగాది శుభాకాంక్షలు

Reading Time: < 1 minute

మిత్రులందరికీ శోభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది కొత్త సంతోషాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరింత సాహిత్యం, మరింత సంగీతం, మరిన్ని మేలుతలపుల్తో ఈ ఏడాది పొడుగునా మీతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నాను.

కొత్తరోజు

మనిషి నడుస్తున్న చెట్టు కనుకనే
చెట్లు చిగిరించే వేళల్లోనే
తనకీ కొత్త ఏడు
మొదలవుతున్నది.

మనిషి మాట్లాడే పక్షి కనుకనే
కోకిల ప్రవేశించే కాలంలోనే
కొత్త ఏడు
కనిపిస్తున్నది.

మనిషికి అప్రయత్నంగా
తెలిసిందిదొక్కటే అనుకుంటాను:
కాలం మొదలయ్యే
కొత్త రోజుని గుర్తుపట్టడం.

22-3-2023

8 Replies to “ఉగాది శుభాకాంక్షలు”

    1. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ శోభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది కొత్త సంతోషాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను🌷

  1. శోభకృత్ ఉగాది పర్వదినాన శుభారంభం మీ కవిత. మీకు శుభాకాంక్షలు.

    1. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ శోభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది కొత్త సంతోషాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను🌷

Leave a Reply Cancel reply

Exit mobile version
%%footer%%