నా కవితలూ, నా పాఠకుడూ

వందేళ్ళకిందట పూర్వకాలపు కవులు
పద్యాలు రాసుకున్నప్పుడు
ప్రపంచమంతా వాటిని ఎలుగెత్తి
పాడుకుంటుందనుకున్నారు

శత, సహస్రాధికంగా మనుషులు
వాళ్ళతో పాటు పుట్టారు, పెరిగారు
ఆ కవులూ ఆ కవితలూ తెలియకుండానే
ఈ లోకం నుంచి నిష్క్రమించారు

ఆ కవులూ వెళ్ళిపోయారు,
వాళ్ళ కవితల్నిక్కడ వదిలిపెట్టి.
ఆ పద్యాలు నా చేతుల్లో పడ్డప్పుడు
అవి నాకోసమే రాసారనుకున్నాను.

నా కవితలూ అంతే-
వందేళ్ళ తరువాతైనా ఎవరో ఒకరు
ఆ తలుపు తెరుచుకుని లోపలకొచ్చి
అక్కడ కొంతసేపు గడిపివెళ్తారు.

18-3-2023

6 Replies to “నా కవితలూ, నా పాఠకుడూ”

  1. namasthe. Iam an kannadada writr and translater from kannada to Telugu, telugu to kannada. For your memmory- your critic was published on my translation ADHUNIKA KANNADA KAVITHA.
    If you accept me please send your WHATAPP NUMBER. Another thing is I dont know corsponding ENGLISH

Leave a Reply

%d bloggers like this: