చిత్రమైన మునక

ఇంకా తెల్లవారని వేళ
అయిదో అంతస్థులో ఉన్న నీగదిలోకి
నీళ్ళు ప్రవహించినట్టు
వేపపూల గాలి.

కిటికీ తెరుస్తావు
కాలనీ మొత్తం నిద్రపోతూ ఉంటుంది.
నిద్రపోతూనే గోదావరిలో
కొట్టుకుపోతున్న గ్రామంలాగా.

గట్టిగా ఊపిరి పీలుస్తావు
ఇదొక చిత్రమైన మునక.
ఎంతలోతుగా మునిగిపోతూ ఉంటే
అంతలా పైకి తేలుతుంటావు.

16-3-2023

8 Replies to “చిత్రమైన మునక”

 1. ఆహ్లాదకరమైన ఆమని ఆహ్వాన కవిత
  ఇంత టెక్నాలజీ అభివృద్ధిచెందినా ఇంకా వాసనల ప్రసారం సాధ్యం కాలేదు. కానీ మీ కవిత చదవగానే వేపగాలి సుగంధం పీల్చిన అనుభూతి కలిగింది.

 2. ఉగాది ఫీలింగ్!
  కొత్తగా…. సంవత్సరానికి సరిపడేంత కొత్తదనం!
  నిద్రలోనే గోదావరి లో కొట్టుకుపోతూ అలలహోరులేని సముద్రం లో కలిసినట్టు…
  నిద్ర అప్పుడే తెమిలేలా లేదు!
  చిత్రమైన మునక… ఎంత మునిగినా గుండెలనిండా శ్వాస అందే మునక!

 3. భలే కవిత
  వేపపూలగాలి
  ఎంతలా మునకలేస్తే అంతలా తేలడం 👌👌

Leave a Reply

%d bloggers like this: