
కరోనా కాలంలో పెళ్లూరి సునీల్, దోర్నాదుల సిద్ధార్థ, మరికొందరు మిత్రులు, నన్ను ఒక జూమ్ సమావేశానికి పిలిచి కవిత్వం గురించి మాట్లాడించారు. 22-10-2020 న జరిగిన ఆ సమావేశం యూట్యూబ్ లింక్ ఈ మధ్య డా.సుంకర్ గోపాల్ నాకు పంపించారు. ఇవాళ ఆ లింకు తెరిచి విన్నాను. ఆసక్తికరంగానే అనిపించింది.
ఆ గోష్ఠిలో నన్ను ప్రశ్నలు అడిగిన మిత్రులకి ఆ రోజు ధన్యవాదాలు చెప్పినట్టు లేదు. అందుకని ఇప్పుడు చెప్పుకుంటున్నాను. అలాగే ఆ కార్యక్రమానికి ముగింపు మాటలు చెప్తూ నా గురించి దయాపూర్వకంగా నాలుగు మాటలు మాట్లాడిన ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారికి మరిన్ని ధన్యవాదాలు.
ఆ గోష్ఠి మీక్కూడా నచ్చుతుందనిపించి ఆ లింకు ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
9-1-2023