
కొత్త సంవత్సరం వస్తుందని అనగానే డిసెంబరు మధ్యనుంచి సంక్రాంతిదాకా ఏదో నవ్య ఉత్సాహం. సురభిళించే చామతులు, పొలాల్లో విరగబూసే బంతిపూలు, పండిన పంటని ఇంటికి తీసుకొచ్చే రెండెడ్లబళ్ళు, ముగ్గులు, గొబ్బిళ్ళు, మంచుతెరల్లో కునికే పల్లెలు- ఈ లోకం గురించి ప్రతిసారీ ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది. ఈ సారి కూడా మాట్లాడదాం అనుకోగానే, ఈ ప్రసంగం ఉందని గుర్తు చేసాడు ఆదిత్య. ఓహ్! ఇందరు కవులు, ఇన్ని కవితలు. మర్చిపోయాను సుమా అనిపించింది. సంతోషంగా విన్నాను మరోసారి.
మీరు కూడా వినాలని మళ్ళా మీముందుకు తెస్తున్నాను ఈ ప్రసంగాన్ని.
డొన్ లోడ్ చేసుకుని మీ సిస్టం లోనో, మీ మొబైల్లోనో కూడా వినవచ్చు. మార్నింగ్ వాక్ కి వెళ్తూనో, లేదా మరేదన్నా పనిచేసుకుంటూనో కూడా.
3-1-2023